చెమటోడుస్తున్న రోహిత్ శర్మ.. 10 కిలోలు తగ్గాడు

by Harish |

టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ కాంపిటేటివ్ క్రికెట్ ఆడి దాదాపు మూడు నెలలు అవుతుంది.

చెమటోడుస్తున్న రోహిత్ శర్మ.. 10 కిలోలు తగ్గాడు
X

దిశ, స్పోర్ట్స్ : టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ కాంపిటేటివ్ క్రికెట్ ఆడి దాదాపు మూడు నెలలు అవుతుంది. ఐపీఎల్‌ తర్వాత అతను మళ్లీ మైదానంలో కనిపించలేదు. టీ20లు, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఇంగ్లాండ్ టూరు, ఇప్పుడు ఆసియా కప్‌‌లో పాల్గొనలేదు. కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్న హిట్ మ్యాన్ ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌తో మైదానంలోకి అడుగుపెట్టబోతున్నాడు. అక్టోబర్‌లో జరిగే ఆ సిరీస్ కోసం రోహిత్ తీవ్రంగా కష్టపడుతున్నాడు. అయితే, అతను కేవలం ఆ సిరీస్ కోసం మాత్రమే కాదు.. 2027లొ జరిగే వన్డే వరల్డ్ కప్ లక్ష్యంగా శ్రమిస్తున్నాడు. ప్రస్తుతం రోహిత్ వయసు 38 ఏళ్లు. ప్రపంచకప్ నాటికి 40 ఏళ్లు వస్తాయి. వరల్డ్ కప్ ప్రణాళికల్లో ఉండాలంటే రోహిత్ రాణించడమే కాకుండా ఫిట్‌నెస్ కాపాడుకోవడం కూడా చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలో ఫిట్‌నెస్ ఫోకస్ పెట్టాడు రోహిత్. ఈ క్రమంలో అతను 10 కిలోలు తగ్గాడు. రోహిత్ భారత మాజీ బ్యాటింగ్ కోచ్ అభిషేక్ నాయర్‌తో కలిసి పనిచేస్తున్నాడు. రెండు నెలలుగా శిక్షణ పొందుతున్నాడు. దానికి ఇప్పుడు ఫలితం వచ్చిందని నాయర్ తెలిపాడు. రోహిత్ 10 కిలోలు తగ్గినట్టు ఇన్‌స్టాలో పోస్టు పెట్టాడు.


Next Story