- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నితీశ్‌కు చాన్స్‌లు ఇస్తూనే ఉంటాం.. కారణమేంటో చెప్పిన అజిత్ అగార్కర్
తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి బాగా ఆడుతున్నాడని, అతనికి చాన్స్‌లు ఇస్తామని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తెలిపాడు.

దిశ, స్పోర్ట్స్ : భారత ఆల్‌రౌండర్, తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి బాగా ఆడుతున్నాడని, అతనికి చాన్స్‌లు ఇస్తామని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తెలిపాడు. దుబాయ్‌లో టీమిండియా టెస్టు కెప్టెన్ గిల్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌లతో వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు జట్టు ఎంపిక గురించి అజిత్ సమావేశమయ్యాడు. అనంతరం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో జట్టును ప్రకటించి మాట్లాడాడు. ఈ సందర్భంగా నితీశ్ గురించి మాట్లాడుతూ..‘తీవ్ర ఒత్తిడిలోనూ నితీశ్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. లార్డ్స్ మ్యాచ్‌లో బౌలింగ్‌తో కూడా ఆకట్టుకున్నాడు. అంతకుముందు ఆస్ట్రేలియాలో తన సత్తా ఏంటో చూపించాడు. అతను ఇప్పుడిప్పుడే తన ఆటను మెరుగుపర్చుకుంటున్నాడు. కాబట్టి, అతను ఇంకా ఎక్కువగా ఆడాలి. అతనిపై మాకు భారీ అంచనాలు ఉన్నాయి. మనం ఎప్పటి నుంచి ఎదురుచూస్తున్న ఆల్‌రౌండర్‌గా అతను అభివృద్ధి చెందాలి. అప్పుడు తుది జట్టు సమతుల్యమవుతుంది.’అంటూ నితీశ్‌పై అగార్కర్ విశ్వాసం వ్యక్తం చేశాడు.
అలాగే, బుమ్రా వర్క్‌లోడ్ గురించి మాట్లాడుతూ.. అతనికి చాలా విశ్రాంతి దొరికిందని, బుమ్రా రెండు టెస్టులు ఆడతాడని చెప్పాడు. అలాగే, పంత్ రికవరీపై అప్‌డేట్ ఇచ్చాడు. సౌతాఫ్రికాతో సిరీస్‌కు అందుబాటులోకి వస్తాడని ఆశిస్తున్నట్టు చెప్పాడు. కరుణ్ నాయర్‌పై వేటు వేయడంపై స్పందిస్తూ.. ఇంగ్లాండ్‌లో అతనిపై పెట్టుకున్న అంచనాలను అందుకోలేకపోయాడని తెలిపాడు. ప్రతి ఒక్కరికి 15-20 టెస్టులు ఇవ్వలేమన్నాడు. అందుకే, నిలకడగా రాణిస్తున్న పడిక్కల్‌కు చాన్స్ ఇచ్చినట్టు చెప్పాడు. సొంతగడ్డపై జరిగే వెస్టిండీస్, సౌతాఫ్రికా సిరీస్‌లకు తమకు చాలా కీలకమన్నాడు. న్యూజిలాండ్‌తో జరిగింది మళ్లీ పునరావృతం కానివ్వమన్నాడు. ‘వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌లో ప్రతి టెస్టు మ్యాచ్ ముఖ్యమే. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో ఓటమి మాకు గుణపాఠం లాంటింది. దాన్ని మళ్లీ పునరావృతం చేయాలనుకోవడం లేదు. కొన్నేళ్లుగా సొంతగడ్డపై మేము చాలా స్ట్రాంగ్. కానీ, కొన్ని ఫలితాలు నిరాశపరిచాయి. వాటిని సరిచేయాలనుకుంటున్నాం.’అని అజిత్ అగార్కర్ చెప్పుకొచ్చాడు.






