సౌతాఫ్రికాపై.. సిరీస్ క్లీన్ స్వీప్.!

by Geesa Chandu |

దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ ను.. ఆతిథ్య వెస్టిండీస్ జట్టు క్లీన్ స్వీప్ చేసింది.

సౌతాఫ్రికాపై.. సిరీస్ క్లీన్ స్వీప్.!
X

దిశ, వెబ్ డెస్క్: దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ ను.. ఆతిథ్య వెస్టిండీస్ జట్టు క్లీన్ స్వీప్ చేసింది. మంగళవారం రాత్రి జరిగిన ట్రినిడాడ్ లోని బ్రియాన్ లారా క్రికెట్ స్టేడియంలో నామ మాత్రపు టీ20 లో వెస్టిండీస్ జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ ఓడి, మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 13 ఓవర్లలో, 4 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేయగా.. అదే సమయానికి వర్షం రావడంతో అఫీషియల్ మ్యాచ్ ను కాసేపు నిలిపారు. వర్షం ముగిసిన అనంతరం డక్ వర్త్ లూయిస్ పద్దతిలో మ్యాచ్ ను కుదించి, వెస్టిండీస్ కు 13 ఓవర్లలో.. 116 పరుగుల లక్ష్యాన్ని విధించారు. అయితే దక్షిణాఫ్రికా బ్యాటర్లు రికెల్టన్(27), మార్క్రం (20), స్టబ్స్(40) ట్రాన్స్ చేశారు. బౌలింగ్ లో రొమారియో షెపర్డ్ 2 వికెట్లు పడగొట్టగా.. ఫోర్డ్, ఇంకా హొసేన్ తలో వికెట్ తీశారు.

అనంతరం.. 13 ఓవర్లలో 116 పరుగుల లక్ష్యం తో బరిలోకి దిగిన కరీబియన్ జట్టు.. 22 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్ ను ముగించేశారు. ఈ పూర్తి సిరీస్ లో మంచి ఫామ్ లో ఉన్న విండీస్ ప్లేయర్లు 116 పరుగుల లక్ష్యాన్ని.. కేవలం 9.2 ఓవర్లలోనే బీట్ చేశారు. దీంట్లో కరీబియన్ స్టార్ ప్లేయర్ నికోలస్ పూరన్ కేవలం 13 బాల్స్ లో 4 సిక్సర్లు, 2 ఫోర్లు బాది 35 రన్స్ చేశాడు. తర్వాత బరిలోకి దిగిన షాయ్ హోప్(42), హెట్ మైర్ (31) రన్స్ తో మ్యాచ్ ను విజయవంతంగా ముగించారు. దీంతో మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ ను కరీబియన్ జట్టు దక్షిణాఫ్రికా పై క్లీన్ స్వీప్ చేసింది.

Next Story