- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత్ దెబ్బ.. పాక్‌కు షాక్.. ఇస్లామాబాద్ నుంచి ప్రతిష్టాత్మక టోర్నీ తరలింపు
పహెల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ చర్యలతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది.

దిశ, స్పోర్ట్స్ : పహెల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ చర్యలతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. తాజాగా పాక్‌కు భారీ షాక్ తగిలింది. సెంట్రల్ ఏసియన్ వాలీబాల్ టోర్నమెంట్ పాక్ నుంచి తరలిపోయింది. ఈ నెల 28 నుంచి ఇస్లామాబాద్ వేదికగా ఈ టోర్నీ ప్రారంభంకావాల్సి ఉంది. అయితే, పహెల్గాం ఘటన నేపథ్యంలో భారత్ ఈ టోర్నీ నుంచి తప్పుకుంది. టోర్నీలో పాల్గొనేందుకు భారత జట్టుకు ఇచ్చిన ఎన్‌వోసీని ఉగ్రదాడి తర్వాత ప్రభుత్వం రద్దు చేసింది. భారత్ తీసుకున్న చర్యతో ఏకంగా పాకిస్థాన్ ఏకంగా ఆతిథ్య హక్కులనే కోల్పోయింది. సెంట్రల్ ఆసియా వాలీబాల్ అసోసియేషన్(సీఏవీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. సెంట్రల్ ఏసియన్ వాలీబాల్ టోర్నమెంట్‌ను ఇస్లామాబాద్ నుంచి ఉజ్బెకిస్తాన్‌కు తరలించింది. ఈ విషయాన్ని పాకిస్తాన్ వాలీబాల్ ఫెడరేషన్(పీవీఎఫ్) సీనియర్ అధికారి ఒకరు శనివారం వెల్లడించారు. పాకిస్తాన్‌కు ఇది చాలా పెద్ద దెబ్బ అని సదరు అధికారి తెలిపారు. వేదిక మారినప్పటికీ టోర్నీ షెడ్యూల్‌లో ఎలాంటి మార్పు జరగలేదు. ఈ ఈవెంట్‌ను ఇండియా తప్పుకోగా.. పాకిస్తాన్, ఇరాన్, తుర్క్‌మెనిస్తాన్, కిర్గిజ్‌స్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ జట్లు పాల్గొంటున్నాయి.






