కరుణ్ నాయర్ డకౌట్..7 ఏళ్ల తర్వాత టీమిండియాలోకి వచ్చి మరీ!

by velandi.Saikiran |

ఇండియా ( India) వర్సెస్ ఇంగ్లాండ్ (England) మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా భారీ స్కోర్ చేసింది. 113

కరుణ్ నాయర్ డకౌట్..7 ఏళ్ల తర్వాత టీమిండియాలోకి వచ్చి మరీ!
X

దిశ, వెబ్ డెస్క్ : ఇండియా ( India) వర్సెస్ ఇంగ్లాండ్ (England) మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా భారీ స్కోర్ చేసింది. 113 ఓవర్లు ఆడిన టీమిండియా... 471 పరుగులకు ఆల్ అవుట్ అయింది. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో కరుణ్ నాయర్ పైన ( Karun nair) చాలా అంచనాలు ఉండేవి. కానీ ఆ అంచనాలను.. తలకిందులు చేస్తూ డకౌట్ అయ్యాడు కరుణ్ నాయర్.

ఈ మ్యాచ్ లో నాలుగు బంతులు ఆడిన కరుణ్ నాయర్ ఒక్క పరుగు చేయకుండానే బెన్ స్టోక్స్ (Ben Stokes) బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. ఏడు సంవత్సరాల తర్వాత టీమిండియాలోకి వచ్చిన కరుణ్.. బాగా ఆడతాడు అనుకుంటే అందరి ఆశలను... అడియాశలు చేశాడు. ఈ నేపథ్యంలోనే టీమిండియా అభిమానులు అందరూ నిరాశ చెందారు.

దీంతో అతనిపై దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది. ఇక అటు కొత్త ఆటగాడు సాయి సుదర్శన్ (Sai Sudarshan) కూడా ఇలాగనే డక్ అవుట్ అయ్యాడు. నాలుగు బంతులు ఆడి సాయి సుదర్శన్ బెన్ స్టోక్స్ బౌలింగ్ లోనే స్మిత్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక అటు యశస్వి జైస్వాల్, గిల్ అలాగే రిషబ్ పంత్ ముగ్గురు సెంచరీలు చేశారు. దీంతో 471 పరుగులకు టీమిండియా ఆల్ అవుట్ అయింది.

Next Story