Virat Kohli : 13ఏండ్ల గ్యాప్..మళ్లీ రంజీ మ్యాచ్ ఆడనున్న విరాట్ కోహ్లీ!

by Y. Venkata Narasimha Reddy |

టీమిండియా(INDIA) మాజీ కెప్టెన్‌, స్టార్ బ్యాటర్(Star Batter) విరాట్‌ కోహ్లీ(Virat Kohli)సుదీర్ఘ విరామానంతరం మళ్లీ దేశవాళీ క్రికెట్(Domestic Cricket) ఆడబోతున్నారు. ఢిల్లీ జట్టు రైల్వేస్‌(Delhi vs Railways Ranji Match)తో ఈ నెల 30నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు ఆడబోతున్న రంజీ మ్యాచ్ లో విరాట్‌ కోహ్లీ బరిలోకి దిగనున్నాడు.

Virat Kohli : 13ఏండ్ల గ్యాప్..మళ్లీ రంజీ మ్యాచ్ ఆడనున్న విరాట్ కోహ్లీ!
X

దిశ, వెబ్ డెస్క్ : టీమిండియా(INDIA) మాజీ కెప్టెన్‌, స్టార్ బ్యాటర్(Star Batter) విరాట్‌ కోహ్లీ సుదీర్ఘ విరామానంతరం మళ్లీ దేశవాళీ క్రికెట్(Domestic Cricket) ఆడబోతున్నారు. ఢిల్లీ జట్టు రైల్వేస్‌(Delhi vs Railways Ranji Match)తో ఈ నెల 30నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు ఆడబోతున్న రంజీ మ్యాచ్ లో విరాట్‌ కోహ్లీ బరిలోకి దిగనున్నాడు. దాదాపు 13 సంవత్సరా(13 Years Gap)ల తర్వాత విరాట్‌ దేశవాళీ క్రికెట్‌ ఆడనున్నారు. చివరిసారిగా నవంబర్ 2012లో ఘజియాబాద్‌లో ఉత్తరప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్ ఆడాడు.

ఏడాది కాలంగా టీమిండియా టెస్టుల్లో వరుస పరాజయాలు చవి చూస్తున్న నేపథ్యంలో బీసీసీఐ ప్రతి క్రికెటర్‌ ను దేశవాళీ క్రికెట్‌ ఆడాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో ఇప్పటికే కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో పాటు జడేజా, రిషభ్ పంత్, కేఎల్.రాహుల్, శుభమన్ గిల్, యశస్వీ జైస్వాల్ వంటి స్టార్ ప్లేయర్లంతా రంజీ పోటీ మ్యాచ్ లు ఆడుతున్నారు. ఢిల్లీ జట్టు రైల్వేస్‌తో ఆడే రంజీ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ కూడా బరిలోకి దిగుతాడని..ఈ మేరకు ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ కు సమాచారం ఇచ్చాడని తెలుస్తోంది. చాలా ఏళ్ల తర్వాత విరాట్‌ రంజీల్లో ఢిల్లీ తరఫున బరిలోకి దిగుతుండడంతో.. మ్యాచ్‌ కోసం అభిమానులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. బ్యాట్‌తో పరుగుల వరద పారించి.. మళ్లీ ఫామ్‌లోకి తిరిగి రావాలని వారు కోరుకుంటున్నారు.

విరాట్ మ్యాచ్ కు ప్రత్యేక ఏర్పాట్లు

అరుణ్‌ జైట్లీ స్టేడియం వేదికగా రైల్వేస్‌ జట్టుతో ఢిల్లీ ఆడనున్న రంజీ మ్యాచ్ కు ఢిల్లీ జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ (DDCA) ప్రత్యేకంగా ఏర్పాట్లు చేపట్టింది. తొలి మ్యాచ్‌లో ఘోర ఓటమి పాలైన ఢిల్లీ.. ప్రస్తుతం విరాట్‌ కోహ్లీపైనే ఆశలు పెట్టుకున్నది. తొలి మ్యాచ్‌లో కెప్టెన్‌ ఆయుష్‌ బదోని ఒక్కడే రాణించగా..టీమిండియా కీపర్..బ్యాటర్ రిషబ్‌ పంత్‌ విఫలమయ్యాడు. విరాట్ రాణించడంతో పాటు మ్యాచ్ గెలవాలని ఢిల్లీ ఆశిస్తుంది. విరాట్ ఆడనున్న రంజీ మ్యాచ్ స్టేడియం వద్ద భారీగా భద్రతను పెంచడంతో పాటు స్టేడియంలో దాదాపు 10వేల మంది ప్రేక్షకులకు మ్యాచ్ చూసేందుకు ఏర్పాట్లు చేపట్టింది. మ్యాచ్ ను అభిమానులు ఉచితంగా వీక్షించేలా చర్యలు తీసుకుంటున్నది. మ్యాచ్‌ టికెట్లను విక్రయించడం లేదని డీడీసీఏ ప్రకటించింది.

Next Story