- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Asia Cup 2025 : అజ్మతుల్లా మెరుపులు.. తొలి మ్యాచ్‌లోనే బోణీ కొట్టిన అఫ్గాన్
by Harish |
ఆసియా కప్‌లో అఫ్గానిస్తాన్ శుభారంభం చేసింది.

X
దిశ, స్పోర్ట్స్ : ఆసియా కప్‌లో అఫ్గానిస్తాన్ బోణీ కొట్టింది. అబుదాబి వేదికగా మంగళవారం జరిగిన ఓపెనింగ్ మ్యాచ్‌లో హాంకాంగ్‌పై 94 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 188 రన్స్ చేసింది. హాంకాంగ్ బౌలర్లు ఆరంభంలోనే ఆ జట్టుకు షాకిచ్చారు. 26 పరుగులకే ఆ జట్టు ఓపెనర్ గుర్బాజ్(8), ఇబ్రహీం జద్రాన్(1) వికెట్లు కోల్పోయింది. మరో ఓపెనర్ సాడిఖుల్లా అటల్(73 నాటౌట్)చివరి వరకు జట్టుగా అండగా నిలిచాడు. మొదట నబీ(33)తో కలిసి జట్టును గాడిలో పెట్టాడు. మరో ఎండ్‌లో వికెట్లు పడుతున్నప్పటికీ అతను మాత్రం బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు.
ఇక, అజ్మతుల్లా క్రీజులోకి వచ్చిన తర్వాత అఫ్గాన్ స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. సిక్సర్లతో మెరుపుల మెరిపించిన అతను కేవలం 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఆసియా కప్‌లో చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు. మొత్తంగా 21 బంతుల్లో 53 స్కోరు చేసి అవుటయ్యాడు. హాంకాంగ్ బౌలర్లు ఇబ్బందిపెట్టినా సెడిఖుల్లా అటల్, అజ్మతుల్లా రాణించడంతో అఫ్గాన్‌కు మంచి స్కోరు దక్కింది. అనంతరం అఫ్గాన్ బౌలర్లు రెచ్చిపోయి హాంకాంగ్ పతనాన్ని శాసించారు. హాంకాంగ్ జట్టులో బాబర్ హయత్(39) మాత్రమే పర్వాలేదనిపించాడు. అతనితోపాటు కెప్టెన్ యాసిమ్(16) డబుల్ డిజిట్ స్కోరు చేయగా.. మిగతా వారిలో ఐదుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితయ్యారు. మరో ఇద్దరు డకౌటయ్యారు. దీంతో ఆ జట్టు 94/9 స్కోరుకే పరిమితమై భారీ ఓటమిని చవిచూసింది.
Next Story






