- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆసియా కప్ కు అఫ్గానిస్తాన్ జట్టు ప్రకటన... కెప్టెన్ ఎవరంటే ?
ఆసియా 2025 టోర్నమెంట్ నేపథ్యంలో... ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా.. ఈ టోర్నమెంట్ ఆడే జ

దిశ, వెబ్ డెస్క్: ఆసియా 2025 టోర్నమెంట్ ( Asia Cup 2025) నేపథ్యంలో... ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ( Afghanistan) కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా.. ఈ టోర్నమెంట్ ఆడే జట్టును ప్రకటించింది ఆఫ్ఘనిస్తాన్. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా అధికారిక ప్రకటన చేసింది. రషీద్ ఖాన్ ( Rasheed Khan) కెప్టెన్సీలో ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ఆడనుంది ఆఫ్గనిస్తాన్ టీం. టి20 ఫార్మేట్ లో ఆసియా కప్ 2025 టోర్నమెంట్ జరగనున్న నేపథ్యంలో... రషీద్ ఖాన్ కు ఈ బాధ్యతలు అప్పగించారు.
అంతేకాదు నూర్ అహ్మద్, మహమ్మద్ నబీ, రహమదుల్లా గురుబాజ్, ఒమర్ జై, నవీన్ ఉల్ హక్, లాంటి ఐపిఎల్ స్టార్లను కూడా... ఆసియా కప్ 2025 టోర్నమెంట్ కు సెలెక్ట్ చేసింది ఆఫ్గనిస్తాన్ జట్టు. ఇది ఇలా ఉండగా... ఇప్పటికే ఆసియా కప్ 2025 టోర్నమెంట్ కోసం టీమిండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు తమ ప్లేయర్లను ప్రకటించేశాయి. తాజాగా ఆఫ్గనిస్తాన్... తమ టీమ్ మెంబర్స్ ను ప్రకటించింది. కాగా ఆసియా కప్ 2025 టోర్నమెంట్ సెప్టెంబర్ 9వ తేదీ నుంచి సెప్టెంబర్ 28వ తేదీ వరకు కొనసాగనుంది.
ఆఫ్గనిస్తాన్ జట్టు టీం : రషీద్ ఖాన్ (c), రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, దర్విష్ రసూలీ, సెదిఖుల్లా అటల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, కరీం జనత్, మహ్మద్ నబీ, గుల్బాదిన్ నాయబ్, షరాఫుద్దీన్ అష్రఫ్, మహ్మద్ ఇషాక్, నూర్ అహ్మద్, ముజీబ్ ఉర్ రహమాన్, అహ్మద్, ముజీబ్ ఉర్ రహమాన్, ఫజల్హక్ ఫరూకీ, నవీన్-ఉల్-హక్ జట్టులో ఉంటారు.






