ఇంగ్లాండ్‌ను చితక్కొట్టిన ఆఫ్గానిస్తాన్.. రికార్డు సెంచరీ నమోదు చేసిన ఇబ్రహీం

by Ajay Maddhiboyina |

చాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా గ్రూప్ బి లోని ఆఫ్గానిస్తాన్, ఇంగ్లాండ్ మధ్య లాహోర్ లోని గడాఫీ స్టేడియంలో లీగ్ మ్యాచ్ జరిగింది.

ఇంగ్లాండ్‌ను చితక్కొట్టిన ఆఫ్గానిస్తాన్.. రికార్డు సెంచరీ నమోదు చేసిన ఇబ్రహీం
X

- శతకంతో చెలరేగిన ఇబ్రహీం

- రాణించిన షాహీదీ, ఒమర్జాయ్

- దూకుడుగా ఆడిన నబీ

- ఇంగ్లాండ్‌పై అఫ్టానిస్తాన్ భారీ స్కోరు

- నిర్ణీత 50 ఓవర్లలో 325/7

దిశ, స్పోర్ట్స్: పసి కూనలే అని లైట్ తీసుకుంటే ఎంత విధ్వంసం సృష్టిస్తారో ఆఫ్గానిస్తాన్ టీమ్‌ను చూస్తే అర్థమవుతుంది. 37 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన ఆఫ్గాన్ జట్టును చూసి ఇంగ్లాండ్ టీమ్ కూడా తేలిగ్గా తీసుకుంది. కానీ, చూస్తుండగానే ఆఫ్గాన్ బ్యాటర్లు ఇంగ్లీష్ బౌలర్లపై విరుచుక పడ్డారు. ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా బౌండరీలు, సిక్సులతో చెలరేగిపోయారు. ఓపెనర్ ఇబ్రహీం జర్దాన్ అయితే ఏ బౌలర్‌ను కూడా వదలకుండా చితకబాదాడు. 146 బంతుల్లో ఏకంగా 177 పరుగులు చేసి ఆఫ్గాన్ టీమ్ భారీ స్కోర్ చేసేలా కీలక పాత్ర పోషించాడు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో అఫ్గాన్ జట్టు 7 వికెట్లు కోల్పోయి 325 పరుగుల భారీ స్కోర్ సాధించింది.

చాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా గ్రూప్ బి లోని ఆఫ్గానిస్తాన్, ఇంగ్లాండ్ మధ్య లాహోర్ లోని గడాఫీ స్టేడియంలో లీగ్ మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్గానిస్తాన్ జట్టు టాప్ ఆర్డర్‌ను ఇంగ్లాండ్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ కుప్పకూల్చాడు. ఓపెనర్ రహ్మానుల్లా కేవలం 15 పరుగులకే పెవీలియన్ చేరాడు. ఫస్ట్ డౌన్‌లో వచ్చిన సిదీఖుల్లా అతల్ 4, ఆ తర్వాత వచ్చిన రహ్మద్ షా 4 పరుగులకే వెనుదిరిగాడు. 37 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయిన ఆఫ్గాన్ జట్టును మరో ఓపెనర్ ఇబ్రహీం జర్దాన్, హష్మతుల్లా షాహిది ఆదుకున్నారు. వీరిద్దరూ కలసి ఇంగ్లాండ్ బౌలర్లను ధీటుగా ఎదుర్కున్నారు. హష్మతుల్లా నెమ్మదిగా ఆడుతూ ఇబ్రహీంకు చక్కని తోడ్పాటు అందించాడు. వీరిద్దరూ కలసి నాలుగో వికెట్‌కు 107 పరుగుల భాగ్వామ్యం అందించారు. హష్మతుల్లా (40) ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన అజ్మతుల్లా ఒమర్జాయ్ దూకుడుగా ఆడాడు. కేవలం 31 బంతుల్లోనే 41 పరుగులు సాధించాడు. మరో ఎండ్‌లో ఉన్న ఇబ్రహీం బౌండరీలు, సిక్సులతో చెలరేగి పోయాడు. ఈ క్రమంలో 106 బంతుల్లో సెంచరీ చేశాడు. 5వ వికెట్‌కు అజ్మతుల్లా, ఇబ్రహీం కలిసి 72 పరుగులు జోడించారు. ఇక అజ్మతుల్ల అవుటౌన తర్వాత వచ్చిన మహ్మద్ నబీ.. ఇబ్రహీంతో పాటుగా చెలరేగి పోయారు. ఇద్దరూ బౌండరీలు, సిక్సులు బాదుతూ ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కులు చూపించారు. వీరిద్దరూ కలిసి 6వ వికెట్‌కు 111 పరుగులు జోడించారు. 177 పరుగులు చేసిన ఇబ్రహీం ఆఖరి ఓవర్లో అవుటయ్యాడు. ఆ తర్వాత నబీ కూడా పెవీలియన్ చేరాడు. చాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగుల బాదిన బ్యాటర్‌గా ఇబ్రహీం (177) రికార్డు సృష్టించాడు. ఆఫ్గానిస్తాన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది. జోఫ్రా ఆర్చర్ 9, లియామ్ లివింగ్‌స్టన్ 2, జామీ ఓవర్టన్, ఆదిల్ రషీద్ చెరో వికెట్ తీశారు.

స్కోర్ బోర్డు:

అఫ్గానిస్తాన్ : రహ్మానుల్లా గుర్జాజ్ (బి) జోఫ్రా ఆర్చర్ 6, ఇబ్రహీం జర్దాన్ (సి) జోఫ్రా ఆర్చర్ (బి) లియామ్ లివింగ్‌స్టన్ 177, సిదీఖుల్లా అతల్ (ఎల్బీడబ్ల్యూ)(బి) జోఫ్రా ఆర్చర్ 4, రహ్మద్ షా (సి) ఆదిల్ రషీద్ (బి) జోఫ్రా ఆర్చర్ 4, హష్మతుల్లా షాహిది (బి) ఆదిల్ రషీద్ 40, అజ్మతుల్లా ఒమర్జాయ్ (సి)(సబ్) టామ్ బాంటన్ (బి) జామీ ఓవర్టన్ 41, మహ్మద్ నబి (సి) జో రూట్ (బి) లియామ్ లివింగ్‌స్టన్ 40, గుల్బదీన్ నాయబ్ 1 నాటౌట్, రషీద్ ఖాన్ 0 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 11 (మొత్తం 314/10, 50 ఓవర్లు)

వికెట్ల పతనం : 11-1, 15-2, 37-3, 140-4, 212-5, 323-6, 324-7

బౌలింగ్ : జోఫ్రా ఆర్చర్ (10-0-64-3), మార్క్ వుడ్ (8-0-50-0), జేమీ ఓవర్టన్ (10-0-72-1), ఆదిల్ రషీద్ (10-0-60-1), జో రూట్ (7-0-47-0), లియామ్ లివింగ్‌స్టన్ (5-0-28-2)

Next Story