న్యూజిలాండ్‌కు భారీ షాక్.. టీ20 ప్రపంచకప్‌ నుంచి డేంజరస్ బౌలర్ ఔట్

by Harish |

న్యూజిలాండ్‌కు భారీ షాక్.. టీ20 ప్రపంచకప్‌ నుంచి డేంజరస్ బౌలర్ ఔట్
X

దిశ, స్పోర్ట్స్ : టీ20 వరల్డ్ కప్‌కు ముందు న్యూజిలాండ్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ ఆడమ్ మిల్నే గాయం కారణంగా ప్రపంచకప్ మొత్తానికి దూరమయ్యాడు. ఎస్‌ఏ టీ20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్‌కు ఆడుతున్న అతను గత ఆదివారం ఎంఐ కేప్ టౌన్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తూ గాయపడ్డాడు. స్కానింగ్‌లో గాయం తీవ్రత ఎక్కువగా ఉన్నట్టు తేలింది. దీంతో అతను ప్రపంచకప్‌కు దూరమైనట్టు కివీస్ బోర్డు వెల్లడించింది. అలాగే, మిల్నే స్థానంలో మరో ఫాస్ట్ బౌలర్ జేమీసన్‌ను జట్టులోకి తీసుకుంది. జేమీసన్ ప్రస్తుతం భారత్‌తో ఐదు టీ20ల సిరీస్‌ ఆడుతున్నాడు. ప్రపంచకప్‌కు కూడా రిజర్వ్ ప్లేయర్‌గా ఎంపికయ్యాడు. ఇప్పుడు మిల్నే దూరం కావడంతో జేమీసన్‌కు వరల్డ్ కప్ ఆడే అవకాశం దక్కింది. మెగా టోర్నీలో కివీస్ ఫిబ్రవరి 8న జరిగే తమ తొలి మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌తో తలపడనుంది.


Next Story