- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పలాష్-స్మృతి వివాదం..కొత్త పంచాయితీకి తెరలేపిన బాలీవుడ్ నటుడు
భారత మహిళల జట్టు స్టార్ క్రికెటర్ స్మృతి మందాన, పలాష్ ముచ్చల్ పెళ్లి పెటాకులు కావడం పైన తాజాగా బాలీవుడ్ నటుడు నందీష్ సింగ్ సంధు ( Nandish Sandhu) షాకింగ్ విషయాలను పంచుకున్నారు.

దిశ, వెబ్ డెస్క్: భారత మహిళల జట్టుకు సంబంధించిన స్మృతి మందాన ( Smriti Mandhana), పలాష్ ముచ్చల్ ( Palash Muchhal) వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దాదాపు 6 నుంచి ఏడు సంవత్సరాల పాటు ఈ ఇద్దరు ప్రేమించుకుని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యారు. అందరి కళ్ళు ఈ జంటపై పడ్డాయో? లేక ఇతర కారణాలో ? తెలియదు కానీ స్మృతి మందాన, పలాష్ ముచ్చల్ పెళ్లి పెటాకులు అయింది. పీటల మీద ఈ సెలబ్రిటీ జంట పెళ్లి రద్దయింది. అయితే వీళ్ళ పెళ్లి రద్దు కావడానికి స్మృతి మందాన తండ్రి గుండెపోటు కారణమని ముందుగా తెలిసినప్పటికీ... ఆ తర్వాత రకరకాల కారణాలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో అనేక రకాల వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు నేషనల్ మీడియాలో కూడా విష ప్రచారం జరుగుతోంది.
స్మృతి మందన, పలాష్ వివాహంపై స్పందించిన బాలీవుడ్ నటుడు
భారత మహిళల జట్టు స్టార్ క్రికెటర్ స్మృతి మందాన, పలాష్ ముచ్చల్ పెళ్లి పెటాకులు కావడం పైన తాజాగా బాలీవుడ్ నటుడు నందీష్ సింగ్ సంధు ( Nandish Sandhu) షాకింగ్ విషయాలను పంచుకున్నారు. అందరూ ఊహించినట్లుగా స్మృతి మందాన, పలాష్ ముచ్చల్ వివాహం ఆగిపోవడానికి ప్రత్యేక కారణాలు లేవని ఆయన కుండబద్దలు కొట్టి చెప్పారు. కేవలం స్మృతి మందాన తండ్రి గుండెపోటు కారణమని చూపే ప్రయత్నం చేశారు బాలీవుడ్ నటుడు నందీష్ సింగ్ సంధు. తనకు అధికారికంగా అందిన సమాచారం ప్రకారం మాత్రం, స్మృతి మందాన తండ్రికి గుండెపోటు రావడం వల్లే పెళ్లి రద్దయిందని వెల్లడించారు.
ఇక స్మృతి మందాన, పలాష్ ముచ్చల్ వివాహం రద్దు అయిన తర్వాత అనేక రకాల వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. బెడ్రూంలో రెడ్ హ్యాండెడ్ గా పలాష్ ముచ్చల్ దొరికాడని కొంతమంది ప్రచారం చేస్తున్నారని తెలిపారు నందీష్ సింగ్ సంధు. అతనికి ఇప్పటికే ప్రియురాలు ఉందని.. అందువల్ల పెళ్లి క్యాన్సిల్ అయింది అని మరి కొంతమంది ప్రచారం చేస్తున్నట్లు వివరించారు. ఈ వార్తలన్నీ కేవలం సోషల్ మీడియాలో మాత్రమే వచ్చాయని... తనకు అందిన సమాచారం మాత్రం తండ్రికి గుండెపోటు కారణంగా పెళ్లి ఆగిపోయిందన్నారు.
మాజీ ప్రియురాలితో పలాష్ ముచ్చల్ ఎఫైర్ ?
భారత మహిళల జట్టుకు సంబంధించిన స్మృతి మందాన ( Smriti Mandhana)తో రిలేషన్ కంటే ముందు పలాష్ ముచ్చల్ ( Palash Muchhal) మరో లేడీతో తిరిగినట్లు వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే, స్మృతి మందానతో ప్రేమ వ్యవహారం నడుపుతూనే ఓ లేడీ కొరియోగ్రాఫర్ తో రిలేషన్ కొనసాగించారట పలాష్ ముచ్చల్. పెళ్లి జరిగే రోజు కూడా కక్కుర్తికి పాల్పడి, ఆ లేడీ కొరియోగ్రాఫర్ తో రొమాన్స్ దొరికాడట. అందుకే పెళ్లి రద్దు అయిందని ప్రచారం చేస్తున్నారు.






