- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏసీసీ చీఫ్ వింత ప్రవర్తన.. కప్ ఇవ్వకుండా తీసుకెళ్లిన మొహ్సిన్ నఖ్వీ
ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ లో భారత జట్టు విజయం సాధించిన విషయం తెలిసిందే. మ్యాచ్ అనంతరం ప్రెజెంటేషన్ సెర్మనీ వింత సంఘటనలు చోటు చేసుకున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ లో భారత జట్టు విజయం సాధించిన విషయం తెలిసిందే. మ్యాచ్ అనంతరం ప్రెజెంటేషన్ సెర్మనీ (Presentation Ceremony) సమయంలో వింత సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (Asian Cricket Council) చీఫ్ గా పాకిస్తాన్ కు చెందిన మొహ్సిన్ నఖ్వీ ఉండటంతో భారత జట్టు ఆసియా కప్ ట్రోఫీని స్వీకరించడానికి నిరాకరించింది. అయితే భారత బౌలింగ్ కోచ్ అయిన మోర్ని మోర్కెల్ (Morne Morkel) ఈ ట్రోఫిని తీసుకొని భారత జట్టుకు ఇవ్వాల్సి ఉండగా.. ACC చీఫ్ మొహ్సిన్ నఖ్వీ ప్రవర్తన అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అతను భారత జట్టు ట్రోఫీని తీసుకోవడానికి నిరాకరించింది అని ప్రకటించగానే.. తన సొంత హోటల్ గదిలోకి ఆసియా కప్ ట్రోఫితో పాటు ప్లేయర్లకు ఇవ్వాల్సిన ఇతర పతకాలను తీసుకెళ్లాడు. దీంతో అంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ACC చీఫ్ వింత ప్రవర్తనపై స్పందించిన బీసీసీఐ నవంబర్‌లో జరిగే తదుపరి ఐసీసీ సమావేశంలో బీసీసీఐ "చాలా తీవ్ర నిరసన" వ్యక్తం చేసేందుకు సిద్ధం అయినట్లు తెలిపింది.
ఇదే ఘటనపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా (BCCI Secretary Devajit Saikia) మాట్లాడుతూ, "భారతదేశం ఒక దేశం తో యుద్ధం చేస్తోంది. ఆ దేశానికి చెందిన నాయకుడు మాకు ట్రోఫీని అప్పగించాల్సి ఉంది. మన దేశంపై యుద్ధం చేస్తున్న దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి నుండి మేము ఆసియా ట్రోఫీ (Asia Trophy)ని అంగీకరించలేము. కాబట్టి మేము ఆ ట్రోఫీని తీసుకోవడానికి నిరాకరించాము. కానీ ఆ పెద్దమనిషి మన దేశానికి ఇవ్వాల్సిన ట్రోఫీని, పతకాలను తన సొంత హోటల్ గదికి తీసుకువెళతాడని దీని అర్థం కాదు. అది పూర్తిగా ఊహించనిది. అతను వీలైనంత త్వరగా ట్రోఫీని భారతదేశానికి తిరిగి పంపుతాడు. ఇది కొంత నైతికతను పునరుద్ధరిస్తుంది. నేటి బహుమతి పంపిణీ కార్యక్రమంలో పెద్దమనిషి ప్రవర్తనకు వ్యతిరేకంగా మేము చాలా బలమైన నిరసనను తెలియజేయబోతున్నాము" అని దేవజిత్ సైకియా మీడియాతో చెప్పుకొచ్చారు.






