- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సూర్యపై దుర్భాషలాడిన పాక్ మాజీ కెప్టెన్.. పాక్ ప్లేయర్ల బుద్ధే అలాంటిందని భారత మాజీ క్రికెటర్ ఫైర్
ఆసియా కప్‌లో పాకిస్తాన్ ప్లేయర్లకు భారత ఆటగాళ్లు హ్యాండ్‌షేక్ ఇవ్వకపోవడం పట్ల పాక్ మాజీ క్రికెటర్లు అక్కసు వెళ్లగక్కుతున్నారు.

దిశ, స్పోర్ట్స్ : ఆసియా కప్‌లో పాకిస్తాన్ ప్లేయర్లకు భారత ఆటగాళ్లు హ్యాండ్‌షేక్ ఇవ్వకపోవడం పట్ల పాక్ మాజీ క్రికెటర్లు అక్కసు వెళ్లగక్కుతున్నారు. ఓ షోలో పాక్ మాజీ కెప్టెన్ మహ్మద్ యూసఫ్ భారత కెప్టెన్ సూర్యకుమార్ పేరును అసభ్యంగా పలికాడు.అంతేకాకుండా అంపైరింగ్ నిర్ణయాలపై టీమిండియా మితిమీరిన ప్రభావం చూపుతుందని ఆరోపించాడు. తాజాగా యూసఫ్ వ్యాఖ్యలపై భారత మాజీ క్రికెటర్ మదన్‌లాల్ స్పందిస్తూ ఫైర్ అయ్యాడు. యూసఫ్‌ది మూర్ఖత్వం అని మండిపడ్డాడు. పాక్ ఆటగాళ్ల చదువు, సంస్కారం ఇలాగే ఉంటుందని ఘాటుగా వ్యాఖ్యానించాడు. ‘పాక్ బుద్ధి అది. వారు ఎవరినైనా దూషింగలరు. వారికి తెలిసిందే అది. ఇంకేం తెలియవు. దుర్భాషలాడటం చాలా తప్పు. అతనిది మూర్ఖత్వం’అని చెప్పాడు. అలాగే, అంపైరింగ్ ఆరోపణలపై కూడా స్పందించాడు. ‘అంపైరింగ్‌పైనా అసహనం వ్యక్తం చేయడం ఆశ్చర్యమేస్తోంది. డీఆర్‌ఎస్ లాంటి ఆధునిక టెక్నాలజీ ఉన్నప్పుడు అటువంటి ఆరోపణలకు ఆధారాలు లేవు.’అని చెప్పుకొచ్చాడు.






