- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అభిషేక్ శర్మ విధ్వంసం..100 సిక్సర్లతో తొలి ఇండియన్‌గా రికార్డు
భారత క్రికెట్‌లో అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్ తో రెచ్చిపోతున్న విషయం తెలిసిందే. దేశవాలి మ్యాచుల నుంచి ఇంటర్నేషనల్ మ్యాచుల వరకు అతను సిక్సర్ల మోత మోగిస్తున్నాడు.

దిశ, వెబ్ డెస్క్: భారత క్రికెట్‌లో అభిషేక్ శర్మ (Abhishek Sharma) విధ్వంసకర బ్యాటింగ్ తో రెచ్చిపోతున్న విషయం తెలిసిందే. దేశవాలి మ్యాచుల నుంచి ఇంటర్నేషనల్ మ్యాచుల వరకు అతను సిక్సర్ల మోత మోగిస్తున్నాడు. ఈ క్రమంలో అభిషేక్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20 ఫార్మాట్‌లో ఒకే క్యాలెండర్ ఇయర్‌లో 100 సిక్సర్లు బాదిన తొలి ఇండియన్ ఆటగాడిగా అభిషేక్ నిలిచాడు. మొత్తం 36 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనతను సాధించాడు. తాజాగా జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT) మ్యాచ్‌లో భాగంగా, సర్వీసెస్‌తో జరిగిన పోరులో పంజాబ్ తరఫున ఆడిన అభిషేక్, 3 సిక్సర్లు కొట్టి ఈ అరుదైన మైలురాయిని చేరుకున్నారు. ఈ ఫీట్‌తో అతను భారత క్రికెట్ చరిత్రలో నిలిచిపోయారు.
ఈ ఏడాది అభిషేక్ శర్మ తన బ్యాటింగ్‌తో అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నారు. ఈ క్యాలెండర్ ఇయర్ (Calendar year)లో అతను టీ20 మ్యాచ్‌లలో ఇప్పటివరకు 1,499 రన్స్ చేశారు. ఇందులో 3 సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలు ఉండటం ఆయన నిలకడైన ప్రదర్శనకు నిదర్శనం. అంతర్జాతీయ స్థాయిలో చూస్తే, వెస్టిండీస్ ఆటగాడు నికోలస్ పూరన్ (Nicholas Pooran) గత ఏడాది ఏకంగా 170 సిక్సర్లు బాదాడు. మొత్తానికి, టీ20 ఫార్మాట్‌లో అభిషేక్ శర్మ (Abhishek Sharma) విధ్వంసక బ్యాటింగ్‌తో భారత క్రికెట్‌కు ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించారు. ఇప్పటికే టీ20 నెంబర్ వన్ బ్యాటర్ గా ఉన్న అభిషేక్ శర్మ, భారత టీ20 జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. త్వరలో జరగబోయే టీ20 ప్రపంచ కప్‌లో అభిషేక్ శర్మ కీలక పాత్ర పోషించనున్నాడని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.






