- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సెమీ-ఫైనల్స్ నుంచి అభిషేక్ ఔట్..రంగంలోకి 300 స్ట్రైక్ రేట్ ప్లేయర్!
భారత్, ఇంగ్లాండ్ మధ్య జరగబోయే సెమీస్ పోరు నుంచి అభిషేక్ శర్మను తప్పించాలని డిసైడ్ అయ్యారని ప్రచారం సాగుతోంది.

దిశ, వెబ్ డెస్క్: భారత అభిమానులకు బిగ్ అలర్ట్. ఎన్నో రోజులుగా భారత జట్టుకు ఓపెనర్ సమస్యను తీర్చుతున్న అభిషేక్ శర్మ ( Abhishek Sharma), భవిష్యత్తు ఇప్పుడు డేంజర్ జోన్ లో పడింది. మొన్నటి ఆసియా కప్, టీ20 టోర్నమెంట్స్ సందర్భంగా అద్భుతంగా రాణించిన అభిషేక్ శర్మ, టీ20 వరల్డ్ కప్ వచ్చే సమయానికి తేలిపోతున్నాడు. ఏ మాత్రం ఆడలేక పోతున్నాడు. దీంతో అతనిపై యాక్షన్ తీసుకునేందుకు భారత జట్టు యాజమాన్యం రంగం సిద్ధం చేసినట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే భారత్, ఇంగ్లాండ్ మధ్య జరగబోయే సెమీస్ పోరు నుంచి అభిషేక్ శర్మను తప్పించాలని డిసైడ్ అయ్యారని ప్రచారం సాగుతోంది.
సెమీ ఫైనల్ నుంచి అభిషేక్ శర్మ ఔట్ !
టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ లో ఇప్పటికే భారత జట్టు అడుగు పెట్టింది. ఇక తన సెమీ ఫైనల్ మ్యాచ్ ఇంగ్లాండ్ తో ఆడనుంది. ఈ భారత్, ఇంగ్లాండ్ ( IND vs ENG semi-final) మ్యాచ్ గురువారం రోజున ముంబై వేదికగా జరుగుతుంది. ఈ మేరకు ఇప్పటికే ఇరు జట్ల ప్లేయర్లు ముంబై వేదికగా ప్రాక్టీస్ మొదలు పెట్టారు. గెలుపు లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. అయితే ఈ క్రమంలో కచ్చితంగా గెలవాల్సిన ఈ మ్యాచ్ కోసం భారత జట్టు యాజమాన్యం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఓపెనర్ గా రైట్ హ్యాండ్ చేసే సంజు శాంసన్ ను అలాగే కొనసాగిస్తూ, అభిషేక్ శర్మ పై వేటు వేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ టోర్నమెంట్ లో ఇప్పటి వరకు అభిషేక్ శర్మ చేసింది కేవలం 80 పరుగులు మాత్రమే. వీటన్నిటిని ఒకే మ్యాచ్ లో సంజు సాధించాడు.
అంతేకాదు ఈ టోర్నమెంట్లో ఇప్పటి వరకు మూడు సార్లు డకౌట్ అయిన చెత్త ప్లేయర్ గా అభిషేక్ శర్మ రికార్డు సృష్టించాడు. కీలక మ్యాచ్ లో చేతులెత్తేస్తున్నాడు. అభిషేక్ శర్మ కారణంగా ఇషాన్ కిషన్ ఫస్ట్ డౌన్ లో వచ్చి తొందరగానే వికెట్ సమర్పించుకుంటున్నాడు. అందుకే అతనికి లైఫ్ ఇచ్చేందుకు అభిషేక్ శర్మను సెమీ ఫైనల్ నుంచి తప్పించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం అభిషేక్ శర్మ మెరుగైన ఫామ్ లో లేడు.. పరుగులు చేయడంలో ఇబ్బంది పడుతున్నాడు. ఈ తరుణంలో అభిషేక్ శర్మను పక్కకు పెట్టి రింకు సింగ్ ను తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు సంజు, ఇషాన్ కిషన్ ఓపెనర్లుగా బరిలోకి దిగుతారు. ఇటు రింకు సింగ్ ఫినిషర్ గా వస్తాడు.
అతడు ఏ స్థానంలో వచ్చినా 300 స్ట్రైక్ రేట్ తో బ్యాట్ జులిపిస్తాడు. అందుకే అభిషేక్ శర్మకు సెమీ ఫైనల్ లో రెస్ట్ ఇచ్చి.. రింకు సింగ్ ను తెరపైకి తీసుకువచ్చారు. అయితే దీనిపై మ్యాచ్ ప్రారంభం అయితేనే క్లారిటీ వస్తుంది. చివరి క్షణంలో ప్లాన్ మార్చే అవకాశాలు కూడా ఉంటాయి. మొత్తానికి అభిషేక్ శర్మ లాంటి డేంజర్ ఆటగాన్ని పక్కన పెట్టడం పెను సవాల్ లాంటిదే. రింకు సింగ్ ఖచ్చితంగా ఆడతాడు అన్న నమ్మకం లేదు. ఈ టోర్నమెంట్ లో అతడు పెద్దగా రాణించిన దాఖలాలు లేవు. అతని కంటే అభిషేక్ శర్మను కొనసాగించడమే బెటర్ అని కొంత మంది భావిస్తున్నారు. మరి దీనిపై తుది నిర్ణయం భారత జట్టు యాజమాన్యందే. ఏది చేసినా ఫైనల్ దాకా భారత జట్టు వెళ్లాలని ఇటు ఫ్యాన్స్ కోరుతున్నారు.






