రెండు మ్యాచ్‌ల్లోనూ డకౌట్.. అభిషేక్‌కు కీలక సూచన చేసిన గవాస్కర్

by Harish |

రెండు మ్యాచ్‌ల్లోనూ డకౌట్.. అభిషేక్‌కు కీలక సూచన చేసిన గవాస్కర్
X

దిశ, స్పోర్ట్స్ : టీ20 వరల్డ్ కప్‌లో భారత యువ బ్యాటర్ అభిషేక్ శర్మ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ డకౌటయ్యాడు. నేడు నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌కు ముందు అతనికి భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఓ సూచన చేశాడు. తొలి బంతిని సింగిల్ తీయాలని సూచించాడు. ‘అభిషేక్ శర్మకు నేనిచ్చే సలహా ఏంటేంటే.. అతను మొదట సింగిల్ తీయాలి. ఆ తర్వాత దూకుడుగా ఆడు. కానీ, మొదటి బంతి మాత్రం సింగిల్ తీయ్. దాని వల్ల కాళ్లు కూడా కదులుతాయి. అభిషేక్ న్యూజిలాండ్‌పై సెంచరీ చేశాడు. అతను ఫామ్‌లో ఉన్నాడు. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ముందుగా క్రీజులో కుదురుకో.. ఆ తర్వాత రెచ్చిపో. అతన్ని మేము అదే చూడాలనుకుంటున్నాం.’అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.


Next Story