- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గిల్ కు బిగ్ షాక్..ఆస్ట్రేలియాతో వన్డేలకు అభిషేక్ శర్మ ?
IND VS AUS ODI: అభిషేక్ శర్మను సెలక్ట్ చేయబోతున్నారట. గిల్ ను పక్కకు తప్పించి.. అభిషేక్ ను తీసుకురానున్నారట.

దిశ, వెబ్ డెస్క్ : టీమిండియా డేంజర్ ఆటగాడు అభిషేక్ శర్మ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఐపీఎల్ లో అద్భుతంగా ఆడి... టీమిండియా జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన అభిషేక్ శర్మ.. ఇప్పుడు దుమ్ములేపుతున్నాడు. ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో ఆకాశమే హద్దు అన్నట్లుగా చెలరేగిపోతున్నాడు. అలాంటి అభిషేక్ శర్మకు మరో ఆఫర్ ఇచ్చిందట బీసీసీఐ.
తర్వలోనే టీమిండియా వర్సెస్ ఆసీస్ మధ్య వన్డే సీరిస్ ప్రారంభం కానుంది. అక్టోబర్ 19వ తేదీ నుంచే టీమిండియా వర్సెస్ ఆసీస్ మధ్య వన్డే సీరిస్ ప్రారంభం అవుతుంది. ఇలాంటి తరుణంలోనే... ఈ సిరీస్ కోసం అభిషేక్ శర్మను సెలక్ట్ చేయబోతున్నారట. గిల్ ను పక్కకు తప్పించి.. అభిషేక్ శర్మను తెరపైకి తీసుకురానున్నారట. ఆసియా కప్ లో గిల్ పెద్దగా రాణించడం లేదు.అందుకే ఈ దిశగా అడుగులు వేస్తున్నారట. ఒకవేళ గిల్ పై వేటు వేస్తే.. రోహిత్ శర్మతో కలిసి...అభిషేక్ శర్మ ఓపెనింగ్ చేస్తాడు. ఇదే జరిగితే... ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించడం ఖాయం అంటున్నారు.






