- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒకే ఓవర్ లో 26 పరుగులు.. అభిషేక్ సూపర్ హాఫ్ సెంచరీ
ఐపీఎల్ 2025 టోర్నమెంట్ లో భాగంగా.. ఇవాళ హైదరాబాద్ వర్సెస్ లక్నో మధ్య మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ లో

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2025 టోర్నమెంట్ లో భాగంగా.. ఇవాళ హైదరాబాద్ వర్సెస్ లక్నో మధ్య మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ లో హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టించాడు. హెడ్ లేకపోయినా జట్టును ముందుకు తీసుకువెళ్లాడు. ఈ మ్యాచ్ లో 20 బంతుల్లోనే 59 పరుగులు చేసి రఫ్ ఆడించాడు అభిషేక్ శర్మ. ఇందులో ఆరు సిక్సర్లు అలాగే నాలుగు బౌండరీలు ఉన్నాయి. 295 స్ట్రైక్ రెడ్ తో దుమ్ము లేపాడు అభిషేక్ శర్మ.
59 పరుగుల వద్ద అవుట్ అయినప్పటికీ... లక్నో బౌలర్ బిష్ణోయ్ వేసిన ఏడవ ఓవర్ లో ఏకంగా నాలుగు సిక్సర్లు వరుసగా కొట్టాడు. దీంతో ఆ ఒక్క ఓవర్ లోనే 26 పరుగులు రాబట్టాడు అభిషేక్ శర్మ. ఈ నేపథ్యంలోనే 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే ఆ తర్వాత లక్నో బౌలర్ దిగ్వేష్ వేసిన అద్భుతమైన బంతికి 59 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. అభిషేక్ శర్మ అవుట్ అయినప్పటికీ... క్లాసెన్, కవిందు ఇద్దరు జట్టును ముందుకు తీసుకు వెళ్తున్నారు.






