- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అభిషేక్, దిగ్వేష్ మధ్య గొడవ.. తాట తీస్తామంటూ SRH వార్నింగ్
ఐపీఎల్ 2025 టోర్నమెంట్ ( IPL 2025) నేపథ్యంలో... సోమవారం జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ ( SRH) వర్సెస్ లక్నో ( Lucknow Super

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2025 టోర్నమెంట్ ( IPL 2025) నేపథ్యంలో... సోమవారం జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ ( SRH) వర్సెస్ లక్నో ( Lucknow Super Giants ) జట్టు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో లక్నో జట్టుపై.. ఏకంగా 6 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది హైదరాబాద్. ఈ దెబ్బకు.. ప్లే ఆఫ్ రేసు నుంచి లక్నో తప్పుకుంది. ఇక ఈ మ్యాచ్ లో ఓ అరుదైన సంఘటన జరిగింది.
59 పరుగులు చేసిన అభిషేక్ శర్మను ( Abhishek Sharma ) అవుట్ చేసిన అనంతరం... లక్నో స్పిన్నర్ దిగ్వేష్ రెచ్చగొట్టాడు. పెవిలియన్ కు వెళ్తున్న అభిషేక్ శర్మను గెలికి మరి.. తన్నించుకున్నాడు. సిగ్నేచర్ సెలబ్రేషన్ చేసుకుంటూనే.. వెళ్ళిపో అంటూ అభిషేక్ శర్మాను గెలికాడు. దీంతో గ్రౌండ్ వదిలి వెళుతున్న అభిషేక్ శర్మ మళ్ళీ... దిగ్వేష్ ( Digvesh Rathi) దగ్గరికి వచ్చి వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. దీంతో అక్కడే ఉన్న లక్నో ప్లేయర్స్ అందరూ ఇద్దరినీ సముదాయించారు. అనంతరం అక్కడి నుంచి అభిషేక్ శర్మ వెళ్ళిపోయాడు.
ఇక మ్యాచ్ అనంతరం.. ఈ ఇద్దరు యంగ్ క్రికెటర్లను ఈశాన్ కిషన్ కలిపేశాడు. దీంతో గొడవ సద్దుమణిగింది. అయితే అభిషేక్ శర్మను అన్నందుకు దిగ్వేష్ ను ట్రోలింగ్ చేస్తున్నారు SRH అభిమానులు. కాగా ఇప్పటికే ఐపీఎల్ 2025 టోర్నమెంట్ ( IPL 2025) నుంచి హైదరాబాద్ ఎలిమినేట్ ఐంది. తాజా ఓటమితో ప్లే ఆఫ్ రేసు నుంచి లక్నో తప్పుకుంది.






