ఆర్సీబీపై ఆడ‌టం నా వ‌ల్ల కాదు, కానీ హెడ్ మాత్రం ఊచ‌కోత కోస్తాడు!

by velandi.Saikiran |

ఐపీఎల్‌లో ఆర్సీబీపై భారీ స్కోరు చేయడానికి ఇష్టపడతాడ‌ని ట్రావిస్ హెడ్ గురించి అభిషేక్ శర్మ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

ఆర్సీబీపై ఆడ‌టం నా వ‌ల్ల కాదు, కానీ హెడ్ మాత్రం ఊచ‌కోత కోస్తాడు!
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభం కాబోతోంది. మార్చి 28వ తేదీన ఈ మెగా టోర్నమెంట్ ప్రారంభం కానుంది. ఈ తరుణంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టి, ఐపీఎల్ లో రాణించేందుకు సిద్ధం అవుతోంది. అయితే ఈ నేపథ్యంలో SRH కు సంబంధించిన ఫ్యాన్స్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ సందర్భంగా హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ ( Abhishek Sharma) చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

RCB మ్యాచ్ పై అభిషేక్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్, బెంగళూరు మధ్య ఐపీఎల్ 2026 తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కు చిన్నస్వామి స్టేడియం వేదిక కాబోతోంది. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో ఫ్యాన్స్ కార్యక్రమంలో అభిషేక్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. బెంగళూరు జట్టుపై తాను పెద్దగా రాణించకపోవచ్చు, కానీ ట్రావిస్ హెడ్ ( Travis Head) మాత్రం చాలా ప్రమాదకరంగా బ్యాటింగ్ చేస్తాడని వెల్లడించారు.

RCB పైన ఆడేందుకు ట్రావిస్‌ హెడ్ చాలా ఇష్టపడతాడని గుర్తు చేశారు. మార్చి 28వ తేదీన ఇక బెంగళూరు జట్టుకు చుక్కలు చూపించడం గ్యారంటీ అని తెలిపారు. ఆ మ్యాచ్ లో కచ్చితంగా తమ జట్టు గెలుస్తుందని వివరించారు అభిషేక్ శర్మ. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

Next Story