- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
KKR బిగ్ స్కెచ్... రంగంలోకి టీమిండియా స్టార్ ఆటగాడు?
ఐపీఎల్ 2024 టోర్నమెంట్ గెలిచిన కేకేఆర్ జట్టు ఐపీఎల్ 2025 టోర్నమెంట్ లో అత్యంత దారుణంగా విఫలమైన

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2024 టోర్నమెంట్ గెలిచిన కేకేఆర్ జట్టు ఐపీఎల్ 2025 టోర్నమెంట్ లో అత్యంత దారుణంగా విఫలమైన సంగతి తెలిసిందే. శ్రేయస్ అయ్యర్ బయటకు వెళ్లడం.. రింకూ సింగ్ లాంటి తదితర ప్లేయర్లు రాణించకపోవడం నేపథ్యంలో గత సీజన్ లో కేకేఆర్ దారుణంగా విఫలమైంది. ఇలాంటి నేపథ్యంలో ఐపీఎల్ 2026 లో దుమ్ములేపేందుకు కేకేఆర్ యాజమాన్యం ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగానే కేకేఆర్ హెడ్ కోచ్ గా అభిషేక్ నాయర్ పేరును తెరపైకి తీసుకువచ్చారు. అతన్ని వచ్చే సీజన్ కోసం వాడుకునేందుకు కేకేఆర్ ప్రయత్నాలు చేస్తోంది.
టీమ్ ఇండియా అసిస్టెంట్ కోచ్ పదవి నుంచి బీసీసీఐ తొలగించిన తర్వాత అభిషేక్, కేకేఆర్ సపోర్ట్ స్టాఫ్ గా జాయిన్ అయ్యారు. ఇక ఇప్పుడు హెడ్ కోచ్ గా ఆయనకు పదవి ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. జాతీయ మీడియాలో కూడా దీనికి సంబంధించిన న్యూస్ వైరల్ గా మారింది. ఇప్పటికే మహిళల ఐపీఎల్ లో యూపీ వారియర్స్ జట్టుకు నాయర్ హెడ్ కోచ్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వచ్చే సీజన్ కోసం కేకేఆర్ బాధ్యతలు కూడా అభిషేక్ కు అప్పగిస్తారట. గౌతమ్ గంభీర్ సూచనల మేరకు కేకేఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.






