అభిషేక్ కు చుక్క‌లు చూపించిన రోహిత్ ఫ్యాన్స్.. మీకు దండం రా అంటూ !

by velandi.Saikiran |

రోహిత్ శర్మతో సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించారు. ఇక ప్రైవేట్ సెక్యూరిటీతో వాళ్లందరినీ కంట్రోల్ చేయించే ప్రయత్నం చేశాడు

అభిషేక్ కు చుక్క‌లు చూపించిన రోహిత్ ఫ్యాన్స్.. మీకు దండం రా అంటూ !
X

దిశ‌, వెబ్ డెస్క్: అభిషేక్ నాయర్‌ కు ( Abhishek Nayar ) టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ( Rohit Sharma ) అభిమానులు చుక్కలు చూపించారు. ప్రాక్టీస్ ముగించుకుని వెళుతున్న‌ రోహిత్ శర్మను చూసేందుకు, ఆయన అభిమానులు ఎగ‌బ‌డ్డారు. ఇక‌ వాళ్లను కంట్రోల్ చేసేందుకు ఫిట్ నెస్‌ కోచ్‌ అభిషేక్ నాయర్‌ ప్రయత్నించాడు. అయినా కూడా ఏ ఒక్క అభిమాని తగ్గలేదు. రోహిత్ శర్మతో సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించారు. ఇక ప్రైవేట్ సెక్యూరిటీతో వాళ్లందరినీ కంట్రోల్ చేయించే ప్రయత్నం చేశాడు అభిషేక్ నాయక్.

అయినా కూడా వాళ్ళు తగ్గలేదు. దీంతో వాళ్ళందరికీ దండం పెట్టి మరి సైడ్ చేయించాడు. అనంతరం రోహిత్ శర్మ అక్కడినుంచి వెళ్ళిపోయాడు. టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య త్వరలో వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇవాళ‌ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు రోహిత్ శర్మ. ఇందులో భాగంగానే ముంబైలోని శివాజీ పార్క్ లో ప్రాక్టీస్ చేశాడు. అయితే ప్రాక్టీస్ చేస్తున్న రోహిత్ శర్మను చూసేందుకు అభిమానులు శివాజీ పార్కుకు వేలాది సంఖ్యలో వచ్చారు. ప్రాక్టీస్ పూర్తయిన తర్వాత అతనితో సెల్ఫీలు, ఆటోగ్రాఫ్ లు తీసుకునేందుకు ఎగబడ్డారు. అభిషేక్ నాయక్ రిక్వెస్ట్ చేసినా కూడా ఎవ్వరూ తగ్గలేదు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. క్లిక్

Next Story