- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IPL 2025 : అభిషేక్ భారీ సిక్స్.. బద్దలైన కారు అద్దం
ఐపీఎల్ 2025(IPL 2025) సీజన్లో నేడు బెంగుళూర్, హైదరాబాద్(RCB vs SRH) జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2025(IPL 2025) సీజన్లో నేడు బెంగుళూర్, హైదరాబాద్(RCB vs SRH) జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ బ్యాటర్స్ రెచ్చిపోయారు. ఫోర్లు, సిక్సులతో గ్రౌండ్ ను హోరెత్తించారు. ఇషాన్ కిషన్ సెంచరిని కొద్దిలో మిస్ అయ్యాడు. ఇక మరో దూకుడు బ్యాట్స్ మన్ అభిషేక్ శర్మ(Abhishek Shaarma) సిక్సులు, ఫోర్లతో దుమ్ము లేపాడు. అయితే అభిషేక్ బాదిన ఓ భారీ సిక్స్ కు ఏకంగా కారు అద్దం బద్దలవడం(Car Mirror Broken) ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2వ ఓవర్లో భువనేశ్వర్ వేసిన బాల్ ను అభిషేక్ డీప్ మిడ్ వికెట్ మీదుగా బాదడంతో.. అది నేరుగా వెళ్ళి POTS కారు ఫ్రంట్ అద్దంపై పడింది. దెబ్బకు అద్దం పగిలిపోయింది. అభిషేక్ ఈ విధ్వంసకర సిక్స్ చూసిన అభిమానులు స్టేడియాన్ని అభిషేక్.. అభిషేక్ అంటూ దద్దరిల్లి పోయేలా అరిచారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.






