ఐపీఎల్‌లో ఆ రూల్ తేవాలంటున్న మాజీ క్రికెటర్.. కీలక సూచన

by Harish |   (  Updated:2025-02-17 14:12:08  IST  )

వచ్చే ఐపీఎల్‌ సీజన్‌లో పాయింట్ల విధానానికి సంబంధించి భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఓ సూచన చేశాడు.

ఐపీఎల్‌లో ఆ రూల్ తేవాలంటున్న మాజీ క్రికెటర్.. కీలక సూచన
X

దిశ, స్పోర్ట్స్ : వచ్చే ఐపీఎల్‌ సీజన్‌లో పాయింట్ల విధానానికి సంబంధించి భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఓ సూచన చేశాడు. లీగ్‌లో బోనస్ పాయింట్స్ సిస్టమ్‌ను తీసుకురావాలని సూచించాడు. ఆదివారం ట్విట్టర్ వేదికగా చోప్రా ఓ పోస్టు పెట్టాడు. బాగా ఆడిన, భారీ విజయం సాధించిన జట్టుకు ప్రోత్సాహకంగా బోనస్ పాయింట్ ఇవ్వాలన్నాడు. ‘ఈ ఐపీఎల్ సీజన్‌లో భారీ విజయం సాధించిన జట్టుకు బోనస్ పాయింట్ ఇవ్వాలనేది నా సూచన. నెట్‌రన్‌రేట్ ఎవరు ఉత్తమంగా ఆడారో తెలుపుతుంది. కానీ, కచ్చితమైన ప్రయోజనం నమోదు కాదు. బోనస్ పాయింట్స్ అనేది స్పష్టమైన ప్రోత్సాహకం. తక్షణ ప్రభావం ఉంటుంది.’ అని ఎక్స్‌లో రాసుకొచ్చాడు. కాగా, ప్రస్తుతం ఐపీఎల్‌లో పాయింట్స్ సిస్టమ్ ప్రకారం.. గెలిచిన జట్టుకు రెండు పాయింట్లు ఇస్తారు. ఫలితం తేలకపోతే చెరో పాయింట్ దక్కతుంది. అలాగే, రెండు, మూడు జట్ల పాయింట్స్ సమంగా ఉన్నప్పుడు నెట్‌రన్‌రేట్ కీలక పాత్ర పోషిస్తుంది. ఎస్ఏ20 లీగ్‌ సహా పలు క్రికెట్ లీగ్స్‌లో బోనస్ పాయింట్స్ సిస్టమ్‌ను ఉపయోగిస్తున్నారు. ఆదివారం బీసీసీఐ ఐపీఎల్-2025 షెడ్యూల్‌ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. మార్చి 22 నుంచి టోర్నీ ప్రారంభంకానుంది.

Next Story