- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గిల్ స్థానంలో CSK విధ్వంకర బ్యాటర్..!
గిల్ స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ కరెక్ట్ అంటూ ఆకాష్ చోప్రా స్పష్టం చేశారు.

దిశ, వెబ్ డెస్క్: భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతున్న నేపథ్యంలో మెడ నొప్పితో కెప్టెన్ గిల్ బాధపడుతున్నాడు. మొదటి టెస్ట్ సందర్భంగా బ్యాటింగ్ మధ్యలోనే రిటైర్డ్ ఔట్ అయి, వెళ్లిపోయిన గిల్, రెండో టెస్ట్ కు పూర్తిగా దూరమయ్యే ప్రమాదం పొంచి ఉంది. మరో వారం రోజులపాటు గిల్ రెస్ట్ తీసుకోవాలని వైద్యులు స్పష్టం చేశారట. అంటే ఈ లెక్కన నవంబర్ 22వ తేదీన ప్రారంభం కానున్న రెండో టెస్టుకు గిల్ దూరమవుతాడు. అయితే గిల్ దూరమైతే, అతని స్థానంలో సాయి సుదర్శన్, పడిక్కల్ లలో ఒకరిని తీసుకుంటారని చర్చ జరుగుతోంది.
ఇలాంటి నేపథ్యంలో టీమిండియా యాజమాన్యానికి మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ( Aakash Chopra) కీలక సూచనలు చేశారు. సాయి సుదర్శన్, పడిక్కల్ కంటే రుతురాజ్ గైక్వాడ్ ను గిల్ స్థానంలో ఎంపిక చేయాలని వెల్లడించారు. దేశవాళి క్రికెట్ లో అద్భుతంగా రుతురాజ్ గైక్వాడ్ రాణిస్తున్నాడు, ప్రస్తుతం పరిస్థితుల్లో అతని సేవలు టీమిండియాకు అవసరం అన్నారు. అందుకే గిల్ స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ కరెక్ట్ అంటూ ఆకాష్ చోప్రా స్పష్టం చేశారు. సాయి సుదర్శన్, పడిక్కల్ లలో ఎవరు ఆడినా, ప్రయోజనం ఉండబోదని సూచనలు చేశారు.






