- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మ్యాచ్ మధ్యలో ఊహించని ఘటన.. గుండెపోటుతో క్రికెటర్ మృతి!
by Vinod kumar |
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా అనూహ్య ఘటన చోటు చేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా అనూహ్య ఘటన చోటు చేసుకుంది. బౌలింగ్ చేస్తుండగా అస్వస్థతకు గురైన క్రికెటర్ గుండెపోటుతో మృతి చెందాడు. అహ్మదాబాద్‌లో జీఎస్టీ ఉద్యోగులు, సురేంద్రనగర్ జిల్లా పంచాయతీ సభ్యుల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్ ఆడుతున్న జీఎస్టీ ఉద్యోగి వసంత్ రాథోడ్ హార్ట్ ఎటాక్‌తో మరణించాడు. బౌలింగ్ చేస్తుండగా అస్వస్థతకు గురైన రాథోడ్ ఒక్కసారిగా మైదానంలో కుప్పకూలాడు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించగా.. గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు తెలిపారు.
Next Story






