- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సత్తాచాటిన హైదరాబాదీ కుర్రాడు.. టీమిండియా అండర్-19లో చోటు
ట్రై సిరీస్ కోసం బీసీసీఐ ఇండియా అండర్ 19– ఏ, ఇండియా అండర్ 19– బి జట్లను ఇవాళ ప్రకటించింది.

దిశ, వెబ్‌డెస్క్: ట్రై సిరీస్ కోసం బీసీసీఐ ఇండియా అండర్ 19– ఏ, ఇండియా అండర్ 19– బి జట్లను ఇవాళ ప్రకటించింది. ఈ సిరీస్‌లో ఇండియా అండర్19-ఏ, ఇండియా అండర్19- బి జట్లతో పాటు అఫ్గానిస్తాన్ అండర్-19 మూడో జట్టుగా పాల్గొనబోతోంది. ఈ మేరకు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (BCCI Centre of Excellence) వేదికగా 17 నుంచి 30 వరకు జరిగే ట్రయాంగిల్ సిరీస్ (Triangle Series) జరగనుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నుంచి మరో క్రికెటర్ అండర్-19 ఇండియా ఏ జట్టులో స్థానం సంపాదించాడు.
నాంపల్లి మల్లెపల్లికి చెందిన మహమ్మద్ అబ్దుల్ మాలిక్ (Mohammed Abdul Malik) బీసీసీఐ అండర్-19 ఏ జట్టుకు ఎంపిక చేసింది. అయితే, ఈ హైదరాబాదీ ఫాస్ట్ బౌలర్ ఇటీవలే జరిగిన అండర్- 19 వినూమాంకడ్ ట్రోఫీలో హయ్యస్ట్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. దీంతో అతడు ఇండియా అండర్-19 జట్టుకు ఎంపికయ్యాడు. తన కొడుకు భారత జట్టుకు ఎంపిక కావడం పట్ల తండ్రి మహ్మద్ అబ్దుల్, కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఇక జూనియర్ క్రికెట్‌లో దుమ్మురేపుతున్న హైదరాబాద్ యంగ్‌స్టర్ ఆరోన్ జార్జ్‌కు నేషనల్ టీమ్‌కు నాయకత్వం వహించే అరుదైన అవకాశం దక్కింది. అతడు ఇండియా అండర్19– బి జట్టుకు సారథిగా ఎన్నికయ్యాడు.






