- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( IPL 2025 ) నేపథ్యంలో.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ( Royal Challengers Bangalore ) వరుస విజయాలతో దూసుకు వెళ్తోంది. మొన్న గుజరాత్ చేతిలో ( Gujarat) ఓటమి మినహా... మొదటి రెండు మ్యాచ్ లో విజయం సాధించింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( RCB). దీంతో ఈ సారి కచ్చితంగా బెంగళూరు కప్పు గెలుస్తుందని ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో... రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు సంబంధించిన ఓ అభిమాని (RCB FAN )వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
గొర్రెలు మేపుతూ... బెంగళూరు జట్టు గెలవాలని.. ఓ బుడ్డోడు సోషల్ మీడియాలో వీడియో పెట్టాడు. ఈసారి ఎలాగైనా బెంగళూరు కప్పు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. అయితే బెంగళూరును గెలిపించేందుకు... ఏకంగా అంపైర్ తో డీలింగ్ మాట్లాడతానని... అతని నెంబర్ ఇవ్వండి అని కూడా పేర్కొన్నాడు ఆ బుడ్డోడు. అంపైర్ కు ( Umpire) తన దగ్గర ఉన్న గొర్రె ఇచ్చి... బెంగళూరును గెలిపించుకుంటానని బహిరంగంగానే చెప్పుకొచ్చాడు. కోహ్లీ అవుట్ కాకుండా... అంపైర్ కు లంచం ఇస్తానని కూడా వ్యాఖ్యానించాడు.
ఈ సారి బెంగళూరు.. ఐపీఎల్ 2025 టోర్నమెంట్ గెలిస్తే... తన దగ్గర ఉన్న గొర్రెలతో దావత్ ఇస్తానని కూడా ప్రకటించేశాడు. తన దగ్గర ఉన్న గొర్రెలన్నీ కూడా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్యాన్స్ అంటూ.. సదరు బుడ్డోడు కామెంట్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో... బెంగళూరు ఫ్యాన్స్ మొత్తం గొర్రెలే అంటూ.. కొంత మంది దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఇక మరి కొంతమంది ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే.. నిజంగానే కప్పు గెలిస్తే.. పెద్ద పార్టీ చేసుకుందాం తమ్ముడు... అంటూ కామెంట్స్ చేస్తున్నారు. RCB ఫ్యాన్స్ అంటే ఆ మాత్రం ఉండాల్సిందే అంటూ మరి కొంతమంది అంటున్నారు.
Ee sala cup namde thammudu
— Arehoo_official (@tweetsbyaravind) April 2, 2025
Dinner ki ready ga undu...#RCB 🤌💜 pic.twitter.com/0CtFbIEFiF






