- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
క్రీడా దిగ్గజాల అరుదైన కలయిక.. ఒకే వేదికపై సచిన్, మెస్సీ
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో పాటు, అంతర్జాతీయ ఫుట్‌బాల్ స్టార్లు లియోనెల్ మెస్సీ, లూయిస్ సురేజ్ ఒకే వేదికపై కనిపించడం అరుదైన దృశ్యం గా మారింది.

దిశ, వెబ్ డెస్క్: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో పాటు, అంతర్జాతీయ ఫుట్‌బాల్ స్టార్లు లియోనెల్ మెస్సీ (Lionel Messi), లూయిస్ సురేజ్ ఒకే వేదికపై కనిపించడం అరుదైన దృశ్యం గా మారింది.. ఈ చిత్రంలో సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) తన జెర్సీ నెంబర్ 10 ఉన్న టీమిండియా జెర్సీని పట్టుకొని ఉండగా, మెస్సీ పక్కనే నిలబడి చిరునవ్వు చిందించారు. కాగా ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఆ ఫొటోలో సచిన్, మెస్సీతో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఇటలీ ఫుట్‌బాల్ క్రీడాకారుడు మార్కో మటేరాజీ ఉన్నారు. క్రీడా ప్రపంచంలోని రెండు ప్రధాన క్రీడల దిగ్గజాలు ఇలా కలవడం అభిమానులకు కనువిందు చేసింది.
ఈ అరుదైన సమావేశం సందర్భంగా లియోనెల్ మెస్సీ, సచిన్ టెండూల్కర్ యొక్క సంతకం చేసిన 10 నెంబర్ జెర్సీని (Jersey number 10) పట్టుకున్నారు. క్రీడా ప్రపంచంలో 10వ నంబర్‌కు ఉన్న ప్రాధాన్యతను ఇది మరింత పెంచింది. క్రికెట్‌లో సచిన్, ఫుట్‌బాల్‌లో మెస్సీ ఇద్దరూ ఈ నంబర్‌తోనే ప్రపంచవ్యాప్త ఖ్యాతిని పొందారు. ఈ దిగ్గజ క్రీడాకారుల కలయిక క్రీడా మైత్రికి, ప్రపంచ క్రీడా సంస్కృతికి ఒక గొప్ప ప్రతీకగా నిలిచింది. ఈ కార్యక్రమంలో ఫడ్నవీస్ పాల్గొనడం ద్వారా, క్రీడలను ప్రోత్సహించడంలో ప్రభుత్వాల పాత్రను కూడా హైలైట్ చేసినట్లయింది.






