భారత టెస్టు జట్టులో కీలక పరిణామం.. 38వ కెప్టెన్‌గా రిషబ్ పంత్ నియామకం

by Malleboina Mahesh |

సౌతాఫ్రికా‌తో రెండో టెస్ట్ నేపథ్యంలో భారత క్రికెట్ జట్టులో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.

భారత టెస్టు జట్టులో కీలక పరిణామం.. 38వ కెప్టెన్‌గా రిషబ్ పంత్ నియామకం
X

దిశ, వెబ్ డెస్క్: సౌతాఫ్రికా‌తో రెండో టెస్ట్ నేపథ్యంలో భారత క్రికెట్ జట్టులో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. గాయం కారణంగా భారత కెప్టెన్ శుబ్మన్ గిల్ జట్టుకు దూరమవడంతో బీసీసీఐ అత్యవసరంగా రిషబ్ పంత్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. గిల్ మొదటి టెస్ట్‌లో జరిగిన నెక్ స్పాసమ్ సమస్య కారణంగా పూర్తిగా కోలుకోకపోవడంతో జట్టు మేనేజ్‌మెంట్ ఆయనను విశ్రాంతికి పంపింది. దీంతో, పంత్‌ను టెస్ట్ జట్టుకు 38వ కెప్టెన్‌గా అధికారికంగా ఎంపిక చేసినట్లు బీసీసీఐ ప్రకటించింది. దాదాపు రెండేళ్ల తర్వాత టెస్ట్ క్రికెట్‌కు తిరిగి వచ్చిన పంత్‌కు ఇది భారీ అవకాశంగా విశ్లేషకులు బావిస్తున్నారు. అలాగే MS ధోనీ తర్వాత వికెట్‌కీపర్‌గా టెస్ట్ జట్టుకు కెప్టెన్ అవుతున్న అరుదైన ఘనత పంత్ సొంతమైంది.

వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ పాయింట్లు కీలకమైన దశలో ఈ మ్యాచ్ జరగనుండటంతో భారత జట్టు పంత్ నాయకత్వంపై భారీ ఆశలు పెట్టుకుంది. గెలుపు కోసం జట్టు కాంబినేషన్, వ్యూహాలు నిర్ణయించడంలో పంత్ పాత్ర ముఖ్యమవుతుందని అంచనా వేస్తున్నారు. కాగా కెప్టెన్ గా ప్రకటించడంతో పంత్ స్పందిస్తూ ప్రస్తుతం తాను ఓవర్ తికింగ్ చేయలేను. జట్టుకు విజయం అవసరం దానికి తగ్గట్టుగా ప్లేయర్లతో కలిసి ముందుకు వెళ్తానని చెప్పుకొచ్చాడు. అలాగే గిల్ స్థానంలో ఆడే ప్లేయర్ ఎవరనే ప్రశ్నలపై స్పందిస్తూ.. అది తన నిర్ణయం కాదని సెలక్టర్లు, కోచ్ చూసుకుంటారని ఈ సందర్భంగా రిషబ్ పంత్ చెప్పుకొచ్చారు.

Next Story