- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Big shock for Pakistan : ఇంకాసేపట్లో పాక్ - భారత్ హై వోల్టేజీ మ్యాచ్ ..పాక్ కు బిగ్ షాక్ ?
ఇంకాసేపట్లో దుబాయ్ వేదికగా చిరకాల ప్రత్యర్థులైన భారత్ పాకిస్తాన్ (India Vs Pakistan)క్రికెట్ జట్ల మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy) హైవోల్టేజీ మ్యాచ్ ప్రారంభమయ్యే ముందు పాక్ జట్టులో కలవరం మొదలైంది

దిశ, వెబ్ డెస్క్ : ఇంకాసేపట్లో దుబాయ్ వేదికగా చిరకాల ప్రత్యర్థులైన భారత్ పాకిస్తాన్ (India Vs Pakistan)క్రికెట్ జట్ల మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy) హైవోల్టేజీ మ్యాచ్ ప్రారంభమయ్యే ముందు పాక్ జట్టులో కలవరం మొదలైంది.
ఇప్పటికే పాక్ ఓపెనర్ ఫఖర్ జమాన్ వెన్ను నొప్పితో ట్రోఫీ నుంచి వైదొలుగగా..ఇప్పుడు స్టార్ బ్యాటర్ బాబార్ ఆజమ్(Star batter Babar Azam)కూడా జట్టుకు అందుబాటు(Doubtful to play)లో ఉండరన్న సమాచారం పాక్ అభిమానులకు షాక్(Big shock ?)ఇస్తోంది. కంటి దురదతో ఇబ్బంది పడుతున్న ఆజమ్ నిన్న జట్టు ప్రాక్టీస్ మ్యాచ్ కు దూరంగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో నేడు భారత్ తో జరిగే మ్యాచ్ లో బాబర్ ఆజమ్ ఆడుతాడో లేడోనన్న అనుమానాలు వైరల్ గా మారాయి.
ఒకవేళ ఈ మ్యాచ్ లో బాబర్ ఆడకపోతే పాక్ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ కానుంది. అయితే బాబర్ ఖచ్చితంగా భారత్ తో జరిగే మ్యాచ్ లో ఆడుతాడని పాక్ క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. చాంపియన్స్ ట్రోఫీలో తొలి మ్యాచ్ లో న్యూజిల్యాండ్ చేతిలో అతిధ్య పాకిస్తాన్ జట్టు ఓడిపోగా, భారత్ తన తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై విజయం సాధించి మంచి ఊపు మీదుంది. అదిగాక ఐసీసీ ట్రోఫీల్లో ఇప్పటిదాకా పాక్ పై భారత్ తన ఆధిపత్యం కొనసాగిస్తుంది.
నేటీ మ్యాచ్ లో పాకిస్తాన్ ఓడిపోతే ఈ టోర్నీ నుంచి నిష్క్రమించక తప్పదు. ఇంకాసేపట్లో మొదలయ్యే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా క్రీడాభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. టాస్ కు ముందు రెండు దేశాల తుది జట్లలో ఎవరెవరు ఆడబోతారన్నది తేలనుంది.






