క్రికెట్ ప్రపంచంలో తీవ్ర విషాదం.. దిగ్గజ అంపైర్ డికీ బర్డ్ కన్నుమూత

by Kema Shiva Kumar |

క్రికెట్ ప్రపంచంలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రఖ్యాత అంపైర్ హెరాల్డ్‌ డెన్నిస్‌ డికీ బర్డ్‌ (Harold Dennis Dickey Bird) (92) మంగళవారం రాత్రి ఆయన ఇంట్లో తుది శ్వాస విడిచారు.

క్రికెట్ ప్రపంచంలో తీవ్ర విషాదం.. దిగ్గజ అంపైర్ డికీ బర్డ్ కన్నుమూత
X

దిశ, వెబ్‌డెస్క్: క్రికెట్ ప్రపంచంలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రఖ్యాత అంపైర్ హెరాల్డ్‌ డెన్నిస్‌ డికీ బర్డ్‌ (Harold Dennis Dickey Bird) (92) మంగళవారం రాత్రి ఆయన ఇంట్లో తుది శ్వాస విడిచారు. ఈ మేరకు యార్క్‌షైర్ కౌంటి క్రికెట్ క్లబ్ (Yorkshire County Cricket Club) ఆయన మరణాన్ని ధృవీకరిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. 70 నుంచి 90వ దశకంలో డికీ బర్డ్ పేరు తెలియని వారుండరేమో. దిగ్గజ అంపైర్‌గా క్రికెట్‌కు ఆయన చేసిన సేవలు అసామాన్యం. 1973 నుంచి 1996 వరకు మొత్తం 66 టెస్టులు, 69 వన్డేల్లో ఆయన అంపైర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. చివరగా 1996 లార్డ్స్‌ (Lords)లో అంపైర్‌‌గా ఆయనకు చివరి టెస్ట్ కాగా, భారత మాజీ దిగ్గజ ప్లేయర్లు రాహుల్‌ ద్రవిడ్, సౌరభ్‌ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్ ఆయన హయాంలో క్రికెట్‌లోకి అడుగుపెట్టారు. అయితే, డికీ బర్డ్ యార్క్‌షైర్ కౌంటి క్రికెట్ క్లబ్ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాడు. 93 మ్యాచ్‌లు ఆడి 3,314 పరుగులు చేశాడు. డికీ బర్డ్ మృతి పట్ల భారత మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, కపిల్‌దేవ్, సచిన్ టెండూల్కర్, సౌరభ్ గంగూలీ సంతాపం వ్యక్తం చేశారు.

Next Story