భారత క్రికెట్‌లో తీవ్ర విషాదం.. హార్ట్ అటాక్‌తో మాజీ ప్లేయర్ హఠాన్మరణం

by Kema Shiva Kumar |

భారత క్రికెట్‌ (Indian Cricket)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

భారత క్రికెట్‌లో తీవ్ర విషాదం.. హార్ట్ అటాక్‌తో మాజీ ప్లేయర్ హఠాన్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: భారత క్రికెట్‌ (Indian Cricket)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మాజీ ఆటగాడు దిలీప్ దోషి (Dilip Doshi) (77) సోమవారం లండన్‌ (London)లో హార్ట్ అటాక్‌తో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల బీసీసీఐ (BCCI) సంతాపం వ్యక్తం చేసింది. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో సౌరాష్ట్ర, బెంగాల్‌కు ప్రాతినిధ్యం వహించిన ఈ లెఫ్ట్ ఆర్మ్ లెగ్ స్పిన్నర్ దిలీప్ దోషి 238 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో 898 వికెట్లను నేలకూల్చాడు. 1979 -1983 మధ్య ఇండియా తరఫున 33 టెస్ట్‌లు, 15 వన్డేలు ఆడిన దిలీప్ టెస్ట్‌లలో 114 వికెట్లు, వన్డేల్లో 22 వికెట్లను తీశారు. అదేవిధంగా 1981లో మెల్‌బోర్న్‌ (Melbourne)లో జరిగిన టెస్టులో ఆస్ట్రేలియాపై టీమిండియా ( Team India) చారిత్రాత్మక విజయంలో దిలీప్‌ 5 వికెట్ హాల్‌తో కీలక పాత్ర పోషించారు. ఇక సుదీర్ఘ కాలం ఆయన ఇంగ్లండ్‌ కౌంటీ క్రికెట్‌లో వార్విక్‌షైర్‌, నాటింగ్‌హామ్‌షైర్‌ జట్ల తరఫున ఆడారు. అంతర్జాతీయ కెరీర్‌కు ముంగింపు పలికిన దిలీప్ దోషి లండన్‌లోనే ఉంటున్నారు. నేడు ఆయన మృతికి సంతాపంగా లీడ్స్‌ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు ఐదు రోజు ఆటలో భారత్‌-ఇంగ్లండ్‌ ఆటగాళ్లు బ్లాక్‌ బ్యాండ్స్‌ చేతికి కట్టుకుని గ్రౌండ్‌లోకి రానున్నారు.

Next Story