- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కోహ్లీ ఫ్యాన్ లైఫ్ టైం మూమెంట్..వీడియో వైరల్
దక్షిణాఫ్రికాతో ఆదివారం రోజున తొలి వన్డే మ్యాచ్ లో భారత జట్టు తలపడిన సంగతి తెలిసిందే. ఈ తొలి వన్డే మ్యాచ్ లో అ

దిశ, వెబ్ డెస్క్: దక్షిణాఫ్రికాతో ఆదివారం రోజున తొలి వన్డే మ్యాచ్ లో భారత జట్టు తలపడిన సంగతి తెలిసిందే. ఈ తొలి వన్డే మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన భారత జట్టు, 17 బంతుల తేడాతో విజయం సాధించింది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ అద్భుతమైన సెంచరీతో రెచ్చిపోయాడు. రాంచీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో చాలా కసిగా ఆడాడు విరాట్ కోహ్లీ. దానికి తగ్గట్టుగానే పరుగులు రాబట్టి, సెంచరీ నమోదు చేసుకున్నాడు. 120 బంతులు ఫేస్ చేసిన విరాట్ కోహ్లీ, మొత్తం 135 పరుగులు సాధించగలిగాడు. తన సెంచరీలో ఏడు సిక్సర్లు బాదిన విరాట్ కోహ్లీ ఏకంగా 11 బౌండరీలతో రెచ్చిపోయాడు. అయితే, ఈ మ్యాచ్ లో 52వ సెంచరీని కోహ్లీ పూర్తి చేసుకున్నాడు. దీంతో సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు.
ఇక కోహ్లీ తన శతకాన్ని సెలబ్రేట్ చేసుకునే సమయంలో ఆసక్తికర సంఘటన జరిగింది. ఉన్నఫలంగా ఓ అభిమాని ప్రేక్షకుల మధ్యలోంచి, దూసుకు వచ్చాడు. కేఎల్ రాహుల్ చూస్తూ ఉండగానే, విరాట్ కోహ్లీ కాళ్ళ పైన పడిపోయాడు. వెంటనే సెక్యూరిటీ సిబ్బంది అలర్ట్ అయి, వెంటనే ఆ అభిమానిని అక్కడి నుంచి తీసుకువెళ్లింది. ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. కాగా విరాట్ కోహ్లీ అభిమానికి ఇది లైఫ్ టైం మూమెంట్ అని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. అభిమానాన్ని ఇలా కూడా చూపించాలా ? ఆటగాడికి ఏదైనా ఆపద జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని మరి కొంతమని నిర్వహిస్తున్నారు. కొంత మంది ఫ్యాన్స్.. కోహ్లీ కోసం ప్రాణాలు కూడా ఇచ్చేస్తారని ఇంకొంత మంది అంటున్నారు. క్లిక్






