WTC Final: సౌత్రాఫికా, ఆస్ట్రేలియా మధ్య కీలక పోరు.. గెలుపెవరిది!

by Yella Dhawani Reddy |   (  Updated:2025-06-11 06:51:40  IST  )

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ (WTC) ఫైనల్‌కు సర్వం సిద్ధమైంది. లండన్‌లోని లార్డ్స్ మైదానంలో బుధవారం (జూన్ 11) నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రతిష్ఠాత్మక పోరులో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలు తలపడనున్నాయి.

WTC Final: సౌత్రాఫికా, ఆస్ట్రేలియా మధ్య కీలక పోరు.. గెలుపెవరిది!
X

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ (WTC) ఫైనల్‌కు సర్వం సిద్ధమైంది. లండన్‌లోని లార్డ్స్ మైదానంలో బుధవారం (జూన్ 11) నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రతిష్ఠాత్మక పోరులో ఆస్ట్రేలియా (Australia), దక్షిణాఫ్రికాలు (South Africa) తలపడనున్నాయి. ఈ కీలక పోరులో గెలుపొందాలని ఇరు జట్లూ పట్టుదలతో ఉన్నాయి. ఇప్పటికే ఎన్నో ఐసీసీ ట్రోఫీలను (ICC Trophy) గెలుచుకున్న ఆస్ట్రేలియా, తన ఖజానాలో మరో టైటిల్‌ను జోడించాలనుకుంటోంది. అయితే, ఇప్పటివరకు ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవని దక్షిణాఫ్రికా ఎలాగైనా విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. ఇక ఈ మ్యాచ్‌పై క్రికెట్ అభిమానుల్లోనూ తీవ్ర ఆసక్తి నెలకొంది. ఈ హోరాహోరీ పోరులో విజయం ఎవరివైపు తలుస్తుందో చూడాలి! అంటూ ఇరు జట్ల బలాబలాలు చర్చించుకుంటున్నారు.

రెండేళ్ల కిందట జరిగిన ఐసీసీ ఫైనల్‌ విజయవంతంగా ముగించిన జట్టులో డేవిడ్ వార్నర్ మినహా మిగతా ఆటగాళ్లు అందుబాటులో ఉండడం ఆసీస్‌కు బలాన్ని ఇస్తోంది. అలాగే, గత 10 ఏళ్లలో లార్డ్స్‌లో జరిగిన ఏ టెస్టు మ్యాచ్‌లోనూ ఆస్ట్రేలియా ఓడిపోలేదు. మరోవైపు దక్షిణాఫ్రికాకు లోతైన బ్యాటింగ్‌ విభాగం ఉంది. ఇక ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోల్లో చాలా వరకు సౌతాఫ్రికా గెలువాలని కోరుకుంటూ కామెంట్లు పెడుతున్నారు.

కాగా, ఆస్ట్రేలియా ఇప్పటివరకూ.. 6 వన్డే ప్రపంచకప్‌లు, ఒక్క టీ20 ప్రపంచకప్, రెండు ఛాంపియన్స్‌ ట్రోఫీలు, ఒక్క ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఐసీసీ ట్రోఫీలను గెలిచింది. అలాగే, ఐసీసీ టోర్నీల్లో 13 సార్లు ఫైనల్‌ చేరిన ఆ జట్టు.. మూడుసార్లు ఓడింది. ఇక దక్షిణాఫ్రికా ఇప్పటిదాకా ఒక్క ఐసీసీ ప్రపంచ ట్రోఫీ కూడా సాధించలేదు. ఆ జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఆడనుండడం ఇదే తొలిసారి.

తుది జట్లు

ఆస్ట్రేలియా: ఖవాజా, లబుషేన్, కామెరూన్‌ గ్రీన్, స్టీవ్‌ స్మిత్, హెడ్, వెబ్‌స్టర్, కేరీ (వికెట్‌ కీపర్‌), కమిన్స్‌ (కెప్టెన్‌), స్టార్క్, హేజిల్‌వుడ్, లైయన్‌.

దక్షిణాఫ్రికా: మార్‌క్రమ్, రికిల్‌టన్, ముల్దర్, బవుమా (కెప్టెన్‌), స్టబ్స్, బెడింగ్‌టన్, కైల్‌ వెరీన్‌ (వికెట్‌ కీపర్‌), యాన్సెన్, కేశవ్‌ మహరాజ్, రబాడ, ఎంగిడి.

Next Story