17 పరుగులకే 3 వికెట్లు.. మరోసారి టీమిండియాను ఆదుకున్న తిలక్ వర్మ

by velandi.Saikiran |   (  Updated:2025-10-03 12:53:28  IST  )

17 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన టీమ్ ఇండియాను.. భారీ స్కోర్ దిశగా తీసుకువెళ్లాడు తిలక్ వర్మ.

17 పరుగులకే 3 వికెట్లు.. మరోసారి టీమిండియాను ఆదుకున్న తిలక్ వర్మ
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టీమిండియా ఏ వర్సెస్ ఆస్ట్రేలియా ఏ జట్ల మధ్య అనధికార వన్డే సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో కష్టాల్లో ఉన్న టీం ఇండియాను మరోసారి తిలక్ వర్మ ఆదుకున్నాడు. 17 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన టీమ్ ఇండియాను.. భారీ స్కోర్ దిశగా తీసుకువెళ్లాడు తిలక్ వర్మ. దీంతో మరోసారి తిలక్ వర్మ పేరు మార్మోగుతోంది.

టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య కాన్పూర్ లోని గ్రీన్ పార్క్ వేదికగా రెండవ అనధికార వన్డే ఇవాళ ప్రారంభమైంది. అయితే ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 17 పరుగులకే కీలక వికెట్లు కోల్పోయింది. ఇలాంటి నేపథ్యంలోనే తిలక్ వర్మ... జట్టు భారాన్ని తన భుజాలపై వేసుకున్నాడు. దీంతో 122 బంతులు ఆడిన తిలక్ వర్మ 94 పరుగులు చేసి... జట్టును బయటపడేశాడు. మొన్న ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ లో కూడా వికెట్లు వరుసగా కోల్పోయినా... ఒంటి చేత్తో టీమిండియానును గెలిపించాడు. ఆసియా క‌ప్ 2025 ఫైన‌ల్స్ లో 69 ప‌రుగులు చేసి.. దుమ్ములేపాడు తిల‌క్ వ‌ర్మ‌. క్లిక్

Next Story