- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సచిన్ రికార్డుపై కన్నేసిన కోహ్లీ.. ఏకంగా 70 అవార్డులతో
664 మ్యాచ్ లు అడిగిన సచిన్ మొత్తం 76 అవార్డులు దక్కించుకున్నాడు. విరాట్ కోహ్లీ 554 మ్యాచ్ ల్లోనే 70 అవార్డ్స్

దిశ, వెబ్ డెస్క్: రాంచీ వేదికగా దక్షిణాఫ్రికా ( South Africa), భారత్ ( India ) మధ్య జరిగిన తొలి వన్డేలో సెంచరీతో విరాట్ కోహ్లీ రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. చాలా రోజుల తర్వాత విరాట్ కోహ్లీ ఈ సెంచరీ నమోదు చేసుకొని, విమర్శకుల నోళ్లకు తాళం వేశారు. అంతేకాదు 2027 వన్డే వరల్డ్ కప్ లో తాను ఆడతానని, నన్నెవరూ ఆపలేరనే సంకేతాన్ని బ్యాట్ ద్వారా ఇచ్చారు కింగ్ కోహ్లీ. ఇక ఈ తొలి వన్డేలో విరాట్ కోహ్లీ చేసిన సెంచరీ కారణంగా దక్షిణాఫ్రికాపై భారత్ అఖండ విజయాన్ని నమోదు చేసుకుంది.
ఏకంగా 17 పరుగులతో భారత జట్టు గ్రాండ్ విక్టరీ కొట్టింది. దీంతో టెస్ట్ సిరీస్ ఓటమి బాధలో ఉన్న భారత అభిమానులకు కాస్త ఊరట లభించింది. రాంచి వేదికగా జరిగిన తొలి వన్డే మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన విరాట్ కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా దక్కింది. ఈ తరుణంలో మరో అరుదైన రికార్డుకు విరాట్ కోహ్లీ దగ్గరయ్యాడు. ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ తన అంతర్జాతీయ క్రికెట్ లో మొత్తం 70 ప్లేయర్ ఆఫ్ ద అవార్డులు దక్కించుకున్నాడు. మరో ఆరు అవార్డులు సాధిస్తే, సచిన్ టెండూల్కర్ రికార్డులు బద్దలు కొట్టనున్నాడు విరాట్ కోహ్లీ ( Virat Kohli).
అటు 664 మ్యాచ్ లు అడిగిన సచిన్ టెండుల్కర్ ( Sachin), మొత్తం 76 అవార్డులు దక్కించుకున్నాడు. విరాట్ కోహ్లీ 554 మ్యాచ్ ల్లోనే 70 అవార్డ్స్ అందుకొని చరిత్ర సృష్టించాడు. వీళ్ళిద్దరి తర్వాత జయ సూర్య 58 అవార్డ్స్ తో మూడో స్థానంలో ఉండగా జాక్వేస్ కలీస్ 57 అవార్డులతో నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు. 2027 వన్డే వరల్డ్ కప్ వరకు రిటైర్మెంట్ ప్రకటించకుండా ఉండి ఉంటే, సచిన్ టెండుల్కర్ రికార్డును కోహ్లీ బద్దలు కొట్టడం గ్యారంటీ అంటున్నారు క్రీడా విశ్లేషకులు.






