వరుసగా 8 సిక్సర్లు.. 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.. వరల్డ్ రికార్డు సృష్టించిన ఆకాశ్

by Harish |

మేఘాలయ క్రికెటర్ ఆకాశ్ కుమార్ చౌదరి వరల్డ్ రికార్డు సృష్టించాడు.

వరుసగా 8 సిక్సర్లు.. 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.. వరల్డ్ రికార్డు సృష్టించిన ఆకాశ్
X

దిశ, స్పోర్ట్స్ : మేఘాలయ క్రికెటర్ ఆకాశ్ కుమార్ చౌదరి వరల్డ్ రికార్డు సృష్టించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ బాదిన ప్లేయర్‌గా నిలిచాడు. రంజీ ట్రోఫీలో భాగంగా ప్లేట్ గ్రూపులో అరుణాచల్‌ప్రదేశ్‌తో జరగుతున్న మ్యాచ్‌లో ఆకాశ్ ఈ ఘనత సాధించాడు. సూర‌త్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో ఆకాశ్ కేవలం 11 బంతుల్లోనే అర్ధ శతకం నమోదు చేశాడు. ఇంతకుముందు ఇంగ్లాండ్ క్రికెటర్ వేన్ వైట్ పేరిట ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డు ఉండేది. అతను 12 బంతుల్లో అర్ధ శతకం కొట్టగా.. తాజాగా అతని రికార్డును ఆకాశ్ బద్దలుకొట్టాడు. 8వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అతను విధ్వంసం సృష్టించాడు. ఒకే ఓవర్‌లో 6 సిక్సర్లు కొట్టడమే కాకుండా వరుసగా 8 సిక్సర్లు బాదడం విశేషం.

ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో వరుసగా 8 సిక్సర్లు బాదిన తొలి ప్లేయర్‌గా ఆకాశ్ మరో వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. మొత్తంగా 14 బంతులు ఎదుర్కొన్న అతను 50 పరుగులతో అజేయంగా నిలిచాడు. మేఘాలయ ఇన్నింగ్స్‌లో అర్పిత్(207) డబుల్ సెంచరీ బాదాడు. అతనికతోడు రాహుల్(144), కిషన్ లింగ్డో(119) సెంచరీలు చేయగా.. ఆకాశ్(50 నాటౌట్) కూడా చెలరేగడంతో ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌ను 628/6 వద్ద డిక్లేర్డ్ ఇచ్చింది. అనంతరం బ్యాటింగ్‌‌కు దిగిన అరుణాచల్ ప్రదేశ్ 73 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఫాలో ఆన్‌ ఆడుతున్న ఆ జట్టు ఆదివారం ఆట ముగిసే సమయానికి 29/3 స్కోరు చేసింది. మేఘాలయ మరో 7 వికెట్లు తీస్తే ఇన్నింగ్స్ విజయం సాధిస్తుంది.


Next Story