- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీమిండియా ఆలౌట్... మూడో టెస్టులో స్కోర్స్ లెవెల్
టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. లార్డ్స్ టెస్ట్ లో టీమిండియా,

దిశ, వెబ్ డెస్క్: టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. లార్డ్స్ టెస్ట్ లో టీమిండియా, ఇంగ్లాండ్ జట్ల స్కోర్లు సమం అయ్యాయి. మొదటి ఇన్నింగ్స్ లో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ టీం... సరిగ్గా 387 పరుగులకు కుప్పకూలింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన టీమిండియా.... 119.2 ఓవర్లు ఆడింది. ఈ తరుణంలోనే 387 పరుగులు చేసి టీమిండియా కూడా ఆల్ అవుట్ అయింది.
ఇంకేముంది రెండు జట్ల స్కోర్లు సమం అయ్యాయి. ఈ రెండు జట్ల మధ్య... స్కోర్లు సమం కావడంతో... ఎవరికీ కూడా ఆదిక్యం రాలేదు. ఇక మూడవరోజు ఇంగ్లాండ్ ఒకే ఒక్క ఓవర్ ఆడింది. ఈ నేపథ్యంలోనే కేవలం రెండు పరుగులు చేసిన ఇంగ్లాండు ఒక వికెట్ కూడా కోల్పోలేదు. అంతలోనే.. మూడవరోజు ఆట ముగిసినట్లు అంపైర్లు ప్రకటించారు.
ఇక అంతకుముందు టీమిండియా స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ సెంచరీ నమోదు చేయగా... రిషబ్ పంత్ 74 పరుగులు చేసి దుమ్ము లేపాడు. చివరలో రవీంద్ర జడేజా 72 పరుగులతో రాణించాడు. ఆ తర్వాత టీమ్ ఇండియా టేలండర్స్... పెద్దగా రాణించకపోవడంతో... 387 పరుగులకే ఆల్ అవుట్ అయింది.






