రెండో వ‌న్డేలో భార‌త్ భారీ స్కోర్‌..స‌ఫారీల ముందు కొండంత టార్గెట్‌

by velandi.Saikiran |

ఇద్దరు స్టార్ క్రికెటర్లు సెంచరీలు నమోదు చేయగా, చివరలో కేఎల్ రాహుల్ తన కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. మొదటి మ్యాచ్ లో 60

రెండో వ‌న్డేలో భార‌త్ భారీ స్కోర్‌..స‌ఫారీల ముందు కొండంత టార్గెట్‌
X

దిశ‌, వెబ్ డెస్క్‌: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండవ వన్డేలో భారత జట్టు భారీ స్కోరు సాధించింది. మొదటి వన్డే తరహాలోనే రెండో వన్డేలో కూడా 300 స్కోర్ దాటేసింది. ఇవాళ్టి మ్యాచ్ లో విరాట్ కోహ్లీతో పాటు రుతురాజ్ రెచ్చిపోయారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయిన భారత జట్టు, ఏకంగా 358 పరుగులు సాధించింది. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ 14 పరుగులు, యశస్వి జైస్వాల్ 22 పరుగులు చేసి విఫలం కాగా, విరాట్ కోహ్లీ, రుతురాజ్ జట్టును ఆదుకున్నారు.

ఈ ఇద్దరు స్టార్ క్రికెటర్లు సెంచరీలు నమోదు చేయగా, చివరలో కేఎల్ రాహుల్ తన కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. మొదటి మ్యాచ్ లో 60 పరుగులు సాధించిన రాహుల్, ఇవాళ 43 బంతుల్లోనే 66 పరుగులతో రెచ్చిపోయాడు. దీంతో భారత జట్టు భారీ స్కోర్ సాధించగలిగింది. ఇక ఈ మ్యాచ్ లో నిర్ణీత 50 ఓవర్ల‌లో 359 పరుగులు సాధించాల్సి ఉంది దక్షిణాఫ్రికా. ఇందులో సఫారీ జట్టు ఓడిపోతే, వన్డే సిరీస్ భారత జట్టు సొంతం చేసుకోనుంది. ఒకవేళ భారత్ ఓడిపోతే, మూడవ వన్డే రెండు జట్లకు కీలకం కానుంది.

Next Story