ఒకే ఓవర్‌లో 24 పరుగులు.. యూపీ సూపర్ విక్టరీ

by Malleboina Mahesh |   (  Updated:2023-03-06 05:04:47  IST  )

WPL 2023 మూడో మ్యాచ్ యూపీ, గుజరాత్ జట్ల మధ్య నేవి ముంబై వేదికగా జరిగిన మ్యాచ్‌లో యూపీ జట్టు చివరి ఓవర్లో 24 పరుగుల చేసి స్టన్నింగ్ విక్టరి నమోదు చేసుకుంది.

ఒకే ఓవర్‌లో 24 పరుగులు.. యూపీ సూపర్ విక్టరీ
X

దిశ, వెబ్‌డెస్క్: WPL 2023 మూడో మ్యాచ్ యూపీ, గుజరాత్ జట్ల మధ్య నేవి ముంబై వేదికగా జరిగిన మ్యాచ్‌లో యూపీ జట్టు చివరి ఓవర్లో 24 పరుగుల చేసి స్టన్నింగ్ విక్టరి నమోదు చేసుకుంది. కాగా ఈ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన గుజరాత్ జట్టు బ్యాటింగ్ చేసి.. 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి.. 169 పరుగులు చేసింది. అనంతరం 170 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన యూపీ జట్టు 19.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. దీంతో యూపీ జట్టు 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముఖ్యంగా యూపీ వారియర్స్ జట్టు చివరి ఓవర్లో 19 పరుగులు కావాల్సి ఉండగా 5 బంతులు 25 పరుగు చేసి విక్టరి సాధించారు. కాగా ఈ సీజన్ వరుసగా రెండోసారి గుజరాత్ జట్టు ఓటమి పాలైంది.

Next Story