- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శ్రీలంకలో చికున్‌గున్యా విజృంభణ.. ఆసియా కప్ వాయిదా
ఈ నెల 6 నుంచి జరగాల్సిన మహిళల ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ వాయిదా పడింది.

దిశ, స్పోర్ట్స్ : ఈ నెల 6 నుంచి జరగాల్సిన మహిళల ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ వాయిదా పడింది. ప్రతికూల వాతావరణం, ఆరోగ్య పరిస్థితుల కారణంగా టోర్నీని వాయిదా వేస్తున్నట్టు ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) సోమవారం ప్రకటించింది. ఈ నెలలో శ్రీలంక వేదికగా టీ20 ఫార్మాట్‌లో ఈ టోర్నీ జరగాల్సి ఉంది. అయితే, టోర్నీని వాయిదా వేయాలని శ్రీలంక క్రికెట్ బోర్డు అధ్యక్షుడు షమ్మీ సిల్వా ఏసీసీకి లేఖ రాశారు. శ్రీలంకలో టోర్నీ నిర్వహణకు అనువైన పరిస్థితులు లేవని, చికున్‌గున్యా వ్యాప్తి చెందుతుందని పేర్కొన్నారు. దీంతో ఏసీసీ ఆసియా కప్‌ను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. తదుపరి షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటిస్తామని ఏసీసీ అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ తెలిపారు. ‘యువ మహిళా క్రికెటర్ల నైపుణ్యాలను మెరుగుపర్చుకోవడానికి, అత్యున్నత స్థాయిలో పోటీపడే అవకాశాలను అందించడానికి ఏసీసీ కట్టుబడి ఉంది. ఆసియాలో మహిళల క్రికెట్ భవిష్యత్తును రూపొందించడంలో ఈ టోర్నీ ప్రాముఖ్యత మాకు తెలుసు. అందుకే వీలైనంత త్వరగా ఈ ఈవెంట్‌ను రీషెడ్యూల్ చేయడానికి ప్రయత్నిస్తాం.’అని నఖ్వీ తెలిపారు. కాగా, మహిళల ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్‌ను తొలిసారిగా 2023లో ప్రారంభించారు. అరంగేట్ర టోర్నీలో ఫైనల్‌లో బంగ్లాదేశ్ ఏ జట్టును ఓడించి భారత్ ఏ జట్టు విజేతగా నిలిచింది.






