- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
WPL 2026: ఆర్సీబీ మరో విజయం
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో వరుసగా రెండవ విజయాన్ని నమోదు చేసుకుంది బెంగుళూరు.

దిశ, వెబ్ డెస్క్: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు దూసుకు వెళ్తోంది. గత సీజన్ కంటే ఈసారి రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగుతోంది. ఇవాళ బెంగళూరు వర్సెస్ యూపీ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో 9 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది బెంగళూరు. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగంలో అద్భుతంగా రాణించిన బెంగుళూరు, వరుసగా రెండవ విజయాన్ని నమోదు చేసుకుంది.
RCB వరుసగా రెండో విజయం
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో వరుసగా రెండవ విజయాన్ని నమోదు చేసుకుంది బెంగుళూరు. ఇవాళ బెంగళూరు వర్సెస్ యూపీ మధ్య మ్యాచ్ జరగగా మెగ్ సేన మొదట బ్యాటింగ్ చేసింది. ఈ నేపథ్యంలోనే నిర్ణీత 20 ఓవర్లు ఆడిన యూపీ, 5 వికెట్ల నష్టానికి 143 పరుగులు సాధించింది. ఈ లక్ష్యాన్ని 12.1 ఓవర్లలో కేవలం ఒక వికెట్ నష్టపోయి బెంగళూరు ఛేదించింది. దీంతో ఈ టోర్నమెంట్ లో వరుసగా రెండవ విజయాన్ని నమోదు చేసుకుంది బెంగళూరు.






