- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టెస్టు క్రికెట్‌కు చావు లేదు : ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్

దిశ, స్పోర్ట్స్ : టెస్టు క్రికెట్‌కు ఎలాంటి ఢోకా లేదని ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ వ్యాఖ్యానించాడు. సోమవారం ఐదో టెస్టు ముగిసిన అతను మాట్లాడుతూ.. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన ఈ సిరీస్ టెస్టు క్రికెట్ చనిపోదని నిరూపించిందని తెలిపాడు. సిరీస్ గెలవనందుకు తాము నిరాశకు గురయ్యామని, కానీ, క్రికెట్ అభిమానిగా అద్భుతమైన సిరీస్‌లో భాగమైనందుకు ఆనందంగా ఉందని చెప్పాడు. ‘25 రోజుల సిరీస్. ఐదు మ్యాచ్‌లూ చివరి రోజుకు వరకూ వెళ్లాయి. ఇరు జట్లు విజయం కోసం ఏం చేయాలో అన్ని చేశాయి. క్రికెట్ ఫ్యాన్ కోణంలో 2-2తో ఉండటం న్యాయమైందే. సిరీస్ విజయం సాధించాలనుకున్నాం. మా కోరిక నెరవలేదు. అందుకు సహజంగానే నిరాశ చెందాం. కానీ, మంచి క్రికెట్ ఆడినందుకు ఇరు జట్లకు క్రెడిట్ ఇవ్వాల్సిందే.’అని స్టోక్స్ తెలిపాడు. ఇటీవల కాలంలో అత్యంత తీవ్రంగా పోటీపడిన సిరీస్‌లలో ఇది ఒక్కటని స్టోక్స్ నొక్కిచెప్పాడు. కాగా, గాయం కారణంగా స్టోక్స్ ఐదో టెస్టుకు దూరమైన విషయం తెలిసిందే. నాలుగు టెస్టుల్లో స్టోక్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శన చేశాడు. 581 రన్స్ చేయడంతోపాటు 17 వికెట్లు పడగొట్టాడు.






