భువనేశ్వర్ ను చెడుగుడు ఆడుకున్న 17 ఏళ్ళ కుర్రాడు..ఏకంగా 26 పరుగులు

by velandi.Saikiran |   (  Updated:2025-05-05 13:05:55  IST  )

ఐపీఎల్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో... రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( RCB) ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ ( Bhuvaneshwar) పరువు

భువనేశ్వర్ ను చెడుగుడు ఆడుకున్న 17 ఏళ్ళ కుర్రాడు..ఏకంగా 26 పరుగులు
X

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో... రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( RCB) ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ ( Bhuvaneshwar) పరువు తీశాడు 17 ఏళ్ల కుర్రాడు ఆయుష్ మహత్రే ( Ayush Mhatre). భువనేశ్వర్ బౌలింగ్ లో ఏకంగా 26 పరుగులు సాధించాడు ఈ 17 ఏళ్ల కుర్రాడు. ఈ సంఘటన రాయల్ చాలెంజ్ బెంగళూరు వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన శనివారం మ్యాచ్ లో చోటు చేసుకుంది.

ఈ మ్యాచ్ లో 17 సంవత్సరాల ఆయుష్ మహత్రే కేవలం 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. అంతేకాదు టాప్ మోస్ట్ బౌలర్ అయిన భువనేశ్వర్ బౌలింగ్ లో 26 పరుగులు సాధించాడు ఆయుష్ మాత్రమే. ఇందులో వరుసగా...4,4,4,6,4,4 పరుగులు సాధించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇది ఇలా ఉండగా ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు నిర్నిత 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 213 స్కోర్ చేసింది. అయితే ఈ లక్ష్యాన్ని చేధించే క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ కూడా అద్భుతంగా రానిస్తోంది. 13 ఓవర్లలోనే రెండు వికెట్లు నష్టపోయి 144 పరుగులు చేసింది చెన్నై. మరో 70 పరుగులు చేస్తే చెన్నై సూపర్ కింగ్స్ గ్రాండ్ విక్టరీ కొడుతుంది.

Next Story