క్రికెట్ చరిత్రలోనే వింత.. ఒక్క రన్.. ఒక్క వైడ్.. 10 వికెట్లు డౌన్

by Harish |

క్రికెట్ చరిత్రలోనే వింత చోటుచేసుకుంది.

క్రికెట్ చరిత్రలోనే వింత.. ఒక్క రన్.. ఒక్క వైడ్.. 10 వికెట్లు డౌన్
X

దిశ, స్పోర్ట్స్ : క్రికెట్ చరిత్రలోనే వింత.. రెండు పరుగులకే ఓ జట్టు ఆలౌటైంది. అందులో ఓ రన్ వైడ్‌గా వచ్చిందే. క్రికెట్ చరిత్రలోనే ఏ ఫార్మాట్‌లోనైనా ఇదే అత్యల్ప స్కోరు. ఈ అరుదైన చెత్త రికార్డు ఇంగ్లాండ్‌లో జరుగుతున్న మిడిలెసెక్స్ కౌంటీ లీగ్‌లో చోటుచేసుకుంది. రిచ్మండ్ ఫోర్త్ ఎలెవన్ ఈ చెత్త రికార్డును నమోదు చేసింది. రిచ్మండ్ ఫోర్త్ ఎలెవన్, నార్త్ లండన్ సీసీ మధ్య శనివారం మ్యాచ్ జరిగింది. ముందుగా బ్యాటింగ్ చేసిన నార్త్ లండన్ సీసీ 45 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 426 రన్స్ చేసింది. ఇక, ఛేదనకు దిగిన రిచ్మండ్ ఫోర్త్ ఎలెవన్ జట్టు రెండు పరుగులే చేసి 10 వికెట్లు కోల్పోయింది. ఆ జట్టు మొత్తం 34 బంతులే ఎదుర్కోంది. రెండు పరుగుల్లో ఒక్క పరుగు బ్యాట్ నుంచి రాగా.. మరో రన్ వైడ్ రూపంలో వచ్చింది. జట్టులో 9 మంది డకౌటవ్వడం గమనార్హం. దీంతో నార్త్ లండన్ సీసీ 424 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అత్యల్ప స్కోరు 6 పరుగులు. ఇది 1810లో నమోదైంది. తాజాగా రిచ్మండ్ ఫోర్త్ ఎలెవన్ చెత్త రికార్డును మూటగట్టుకుంది.


Next Story