- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎందుకీ కుండపోత వానలు?
గత నెల రోజుల నుంచి తెలంగాణలో కుండపోత వానలు కురుస్తున్న సంగతి తెలిసిందే.

దిశవెబ్ డెస్క్ : గత నెల రోజుల నుంచి తెలంగాణలో కుండపోత వానలు కురుస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన తర్వాత మొదటి నెలరోజుల దాకా అప్పుడప్పుడు చిరు చినుకులు రాలడం తప్పితే భారీ వానలు పడింది లేదు. కానీ గత మూడు వారాలుగా రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు జలవిలయం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా గత నాలుగు రోజులుగా పలు జిల్లాల్లో కురిసిన కుండపోత వర్షాలు, భారీ ఆకస్మిక వరదలకు నదులు, చెరువులు, ఊర్లు ఏకం అయ్యాయి. ఎటు చూసినా కనుచూపు మేర భారీ వరద నీరే. వరద ధాటికి పంటపొలాలు, రహదారులన్నీ ఎక్కడికక్కడ కొట్టుకుపోయాయి. మరో రెండు రోజులు కూడా రాష్ట్రంలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణశాఖ హెచ్చరించింది.
అయితే ఇపుడు అందరిలో ఒకటే ప్రశ్న.. వరణుడు పగబట్టినట్టు ఎందుకీ కుండపోత వానలు. ఒక్కరోజులో 600 మిల్లీ మీటర్ల వర్షం కురవడం అందులోను కొద్దిగంటలోనే దాదాపు 350 మిల్లీ మీటర్ల వర్షం నమోదు కావడం వాతావరణ నిపుణులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఈ కుంభవృష్టి ధాటికి ఏది ఊరో, ఏది చెరువో.. ఏది రహదారో.. ఏది వాగో తెలియకుండా పోయింది. జనం అయితే ఆ వానల్లో చిక్కుకొని, తిండి నీళ్లు లేక బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు దక్కితే చాలురా దేవుడా అనుకున్నారు. ఒక గంటసేపు కుండపోత వాన కురిసి క్లౌడ్ బరస్ట్ లాగ ఆగిపోలేదు. ఆకాశానికి చిల్లు పడ్డట్టు.. నాన్ స్టాప్ గా కురుస్తూనే ఉంది. సరే అల్పపీడన ప్రభావం వల్ల అనుకుంటే మరి తీరప్రాంత రాష్ట్రాలైన ఏపీ, తమిళనాడు, ఒడిశాలో ఇంతకంటే ఎక్కువ వర్షాలు కురవాలి కదా. అక్కడ మాత్రం సాధారణ వర్షాలే కురుస్తున్నాయి. మరి ఇక్కడ మాత్రం ఎందుకీ అతి అత్యంత భారీ వానలు..??
దశాబ్దాలుగా రాష్ట్రంలో కురుస్తున్న వర్షపాతాన్ని, వాతావరణాన్ని పరిశోధించి ఒక అంచనాకు వచ్చాక తేలింది ఏమిటంటే..? తెలంగాణలో వర్షాలు కాలానుగుణ లక్షణాలపై ఆధారపడి ఉంటాయి. జూన్ నుండి సెప్టెంబర్ కాలంలో రుతుపవనాలు(మాన్సూన్) సోమాలియన్ జెట్ స్ట్రీమ్స్ ప్రభావంతో నైరుతి (దక్షిణ-పశ్చిమ) దిశ నుండి వీస్తాయి. ఇవి మహారాష్ట్ర లోపలి భాగాల నుండి వస్తాయి. సముద్ర మట్టానికి తక్కువ ఎత్తులో ఉన్న ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని తేమ గాలులతో మహారాష్ట్ర నుంచే వీచే గాలులతో కలవడం వల్ల ఈ ప్రాంతాలు అత్యధిక వర్షపాతాన్ని పొందుతాయి. ఇవి తెలంగాణ మీదుగా కురుస్తూ పోవడం వల్ల చివరకు ఆంధ్రప్రదేశ్‌లో తక్కువ వర్షాలు పడతాయి.
ఇక అక్టోబర్ చివర, నవంబర్, డిసెంబర్ సమయంలో రుతుపవనాలు ఈశాన్య (ఉత్తర-తూర్పు) దిశ నుండి సముద్రం మీదుగా వీచే గాలులతో కలుస్తాయి. ఇవి వస్తూ వస్తూ సముద్రం నుంచి అధిక తేమను తీసుకువస్తాయి. దీని వల్ల విశాఖపట్నం నుండి నెల్లూరు వరకు ఏపీ తీర ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తాయి. ఈ ఈశాన్య గాలులు వల్ల ఏపీ మీదుగా అధికంగా వర్షాలు కురుస్తూ.. మిగిలిన కొద్దిపాటి తేమతో తెలంగాణలో కేవలం తేలికపాటి జల్లులు మాత్రమే కురుస్తాయి. ఒక ప్రాంతంలో వర్షపాతం యొక్క తీవ్రత, వర్షాలు కురవడం రుతుపవనాల దిశ, కాలానుగుణ లక్షణాలపై ఆధారపడి ఉంటుంది. అందుకే ఇపుడు తెలంగాణలో కుండపోత వానలు కురుస్తున్నాయి. ఇవి నెమ్మదిగా సెప్టెంబరు చివరి వరకు తగ్గిపోతాయి. ఆతరువాత ఈ భారీ వర్షాలు ఏపీ, తమిళనాడుకు షిఫ్ట్ అవుతాయన్నమాట.






