- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Disha Special: అర్ధరాత్రి భారీ శబ్ధాలు.. పాకిస్థాన్ ప్రజలు చెబుతుంది ఇదే..
భారత్ అన్నంత పని చేసింది. పహెల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుంది.

భారత్ అన్నంత పని చేసింది. పహెల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్ర స్థావరాలపై గత అర్ధరాత్రి ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సిందూర్ పేరుతో మెరుపుదాడులతో విరుచుకుపడింది. మొత్తం 9 ఉగ్రస్థావరాలు లక్ష్యంగా మిసైళ్ల వర్షం కురిపించింది. అంతర్జాతీయ సరిహద్దుకు 100 కిలోమీటర్లలోపు ఉన్న క్యాంపులను టార్గెట్ చేసి ధ్వంసం చేసింది. ఈ మెరుపు దాడుల్లో ఎంత మంది చనిపోయారు? ఎవరెవరు హతమయ్యారో పూర్తి వివరాలు ఈ లింక్‌ను ఓపెన్ చేసి చూడండి.
హెల్గాం టెర్రర్ అటాక్‌తో ప్రతీకారంతో రగిలిపోయిన భారత్ మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత దాయాది పాక్‌పై వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈ క్రమంలోనే ‘ఆపరేషన్ సిందూర్’పై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో స్పందించారు. కౌంటర్‌గా పాక్ ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సూచించారు. భారత్‌పై యుద్ధానికి ధైర్యం చేయవద్దని సలహా ఇచ్చారు. ఉగ్రవాదులపై చర్య తీసుకునే హక్కు భారత్‌కు ఉందని పేర్కొన్నారు. ఇంకా అమెరికా ఏం హెచ్చరించిందో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.
పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపైన భారత సైన్యం ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట క్షిపణులతో దాడి చేసి ధ్వంసం చేసింది. ఈ నేపథ్యంలో అసలు ఈ ఆపరేషన్‌కు సిందూర్ అనే పేరు ఎందుకు పెట్టారు అనే సందేహం సర్వత్రా వ్యక్తమవుతోంది. పహెల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో 26మంది హతమయ్యారు. వీరిలో ఎంతోమంది మహిళల నుదుటన సిందూరం దూరమైంది. అందుకు ప్రతీకారంగానే ఈ ఆపరేషన్‌కు సింధూర్ అనే పేరు పెట్టినట్లు నెట్టింట చర్చ సాగుతోంది. ఈ పేరుపై పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ లింక్‌ను క్లిక్ చేయాల్సిందే..
భారత వైమానిక దాడులపై పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్పందించారు. భారత్ చేసిన ఈ దాడులకు తప్పకుండా బలమైన సమాధానం చెబుతామని హెచ్చరించారు. పాక్‌లోని ఐదు ప్రదేశాలపై భారత్ పిరికి దాడులకు పాల్పడిందని ఆరోపించారు. ఈ ఉద్రిక్త వాతావరణ వేళ సాయుధ దళాలకు యావత్ పాకిస్తాన్ అండగా ఉంటుందని తెలిపారు. ఇంకా ఎలాంటి ప్రకటనలు చేశారో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.






