ఎన్నాళ్లీ ఎదురుచూపులు.. బిల్డింగ్, లే అవుట్స్ నిబంధనలపై పట్టణాభివృద్ధి శాఖ నిర్లక్ష్యం !

by Javid Pasha |

ఎన్నాళ్లీ ఎదురుచూపులు.. బిల్డింగ్, లే అవుట్స్ నిబంధనలపై పట్టణాభివృద్ధి శాఖ నిర్లక్ష్యం !

ఎన్నాళ్లీ ఎదురుచూపులు.. బిల్డింగ్, లే అవుట్స్ నిబంధనలపై పట్టణాభివృద్ధి శాఖ నిర్లక్ష్యం !
X

దిశ, తెలంగాణ బ్యూరో : సీఎం రేవంత్ రెడ్డి మానసపుత్రిక అయిన ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని (ఎఫ్సీడీఏ) రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇది రంగారెడ్డి జిల్లాలోని 765.28 చదరపు కిలోమీటర్ల పరిధిలో శ్రీశైలం, నాగార్జునసాగర్ రహదారుల మధ్య విస్తరించి ఉంది. దీనిలో ఆమన్ గల్, ఇబ్రహీంపట్నం, కందుకూరు, కడ్తాల్, మహేశ్వరం, మంచాల్, యాచారం మండల్లాలోని 56 రెవెన్యూ గ్రామాలను విలీనం చేసింది. కానీ ఇంతవరకు ఫ్యూచర్ సిటీలో బిల్డింగ్, లేఅవుట్లకు సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించలేదు. ఈ మేరకు ఆ ప్రాంతాల్లోని డెవలపర్లు, బిల్డర్లు ఎదురుచూస్తున్నారు. ఫ్యూచర్ సిటీని ప్రపంచ నగరాలతో పోటీపడే విధంగా, దేశానికే తలమానికంగా నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటిలో మల్టీమోడల్ కనెక్టివిటీ, ఎలక్ట్రిక్ పబ్లిక్ ట్రాన్స్ ఫోర్ట్, గ్రీన్ బిల్డింగ్స్ లాంటి ఆధునిక సౌకర్యాలతోపాటు ఏఐ సిటీ, ఫార్మా హబ్, స్పోర్ట్స్ సిటీ, క్లీన్ ఎనర్జీ ఇన్నోవేషన్ జోన్ వంటివి ఫ్యూచర్ సిటీలో భాగంగా ఉంటాయని ప్రభుత్వం వెల్లడించింది.

30వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ

హైదరాబాద్ లో దాదాపు 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. ఇప్పటికే ఇందులో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేసింది. స్పోర్ట్స్ యూనివర్సిటీతోపాటు ఫార్మా సిటీ, ఏఐ సిటీ, సాఫ్ట్ వేర్, లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ టెక్నాలజీ పరిశ్రమల పవర్ హబ్‌గా దీన్ని తీర్చిదిద్దుతోంది. రీజనల్ రింగ్ రోడ్డు నుంచి అవుటర్ రింగ్ రోడ్డు వరకు రేడియల్ రోడ్లతో పాటు ఫ్యూచర్ సిటీలో గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మించేందుకు టెండర్లు కూడా పిలిచింది.

స్పష్టత కరువు..

పురపాలక, పట్టణాభివృద్ది శాఖలో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, డీటీసీపీ, ఎఫ్సీడీఏ కీలకంగా ఉన్నాయి. వీటిలో ఎఫ్సీడీఏ తప్ప మిగిలిన విభాగాలకు పూర్థి స్థాయిలో యంత్రాంగం ఉన్నది. అయితే రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఎండీఏను విస్తరించడంతోపాటు కొత్తగా ఎఫ్సీడీఏనూ ఏర్పాటు చేసింది. దీంతో డీటీసీపీ పరిధిలోని గ్రామ పంచాయతీలను హెచ్ఎండీఏలో విలీనం చేశారు. రంగారెడ్డి జిల్లాల్లోని ఆమన్ గల్, ఇబ్రహీంపట్నం, కందుకూరు, కడ్తాల్, మహేశ్వరం, మంచాల్, యాచారం మండలాల్లోని 56 రెవెన్యూ గ్రామాలతో ఎఫ్సీడీఏను ఏర్పాటు చేశారు. ఈ మండలాల్లోని లేఅవుట్లకు సంబంధించిన అనుమతుల జారీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అయితే హెచ్ఎండీఏ నుంచి ఎఫ్సీడీఏలో విలీనం చేసిన గ్రామాల్లో అయితే హెచ్ఎండీఏ ఆధ్వర్యంలోనే ప్రాసెస్ చేయాలని నిర్ణయించినట్టు అధికారులు చెబుతున్నారు. దీంతోపాటు డీటీసీపీ నుంచి హెచ్ఎండీఏలో విలీనం చేసిన గ్రామాలకు సంబంధించిన క్లారిటీ కోసం ప్రభుత్వానికి డీటీసీపీ లేఖ రాసినా ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు. దీంతో డీటీసీపీ అనుమతితో చేసిన లేఅవుట్లకు సంబంధించిన మార్ట్ గేజ్ సమస్య ముందుకొచ్చింది. దీనిపై కొంతమంది డెవలపర్లు హెచ్ఎండీఏ అధికారులను కలిస్తే డీటీసీపీ జారీచేసిన ప్రొసిడింగ్స్ ప్రకారం గ్రామపంచాయతీలకు మార్ట్ గేజ్ చేయాలని సూచించారు. హెచ్ఎండీఏ మ్యాపింగ్ తర్వాత కూడా మార్ట్ గేజ్ చేయకుంటే హెచ్ఎండీఏకు చేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

Next Story