మేడారంపై దండెత్తిన సేనాని?

by Bhoopathi Nagaiah |

కాకతీయ చక్రవర్తి రెండవ ప్రతాపరుద్రుడి కాలంలో మేడారం యుద్ధం జరిగింది. అయితే, ప్రతాపరుద్రుడు నేరుగా యుద్ధానికి రాలేదు.

మేడారంపై దండెత్తిన సేనాని?
X

కాకతీయ చక్రవర్తి రెండవ ప్రతాపరుద్రుడి కాలంలో మేడారం యుద్ధం జరిగింది. అయితే, ప్రతాపరుద్రుడు నేరుగా యుద్ధానికి రాలేదు. తన ప్రధాన సేనాని, మంత్రి అయిన యుగంధరుడు నాయకత్వంలో సైన్యాన్ని పంపాడు. ఈ యుద్ధం మేడారం సరిహద్దుల్లో ఉన్న లక్నవరం అడవులు, జంపన్న వాగు పరిసరాల్లో జరిగింది. పన్నులు చెల్లించలేదని, కాకతీయ సామ్రాజ్య ఆధిపత్యాన్ని ధిక్కరించారని గిరిజనులపై దాడి చేశారు.

వీరమరణాల వరుసక్రమం

యుద్ధంలో సమ్మక్క కుటుంబ సభ్యులు ఒకరి తర్వాత ఒకరు అత్యంత ధైర్యంగా పోరాడి ప్రాణాలు వదిలారు. ముందుగా యుద్ధం మొదలైన లక్నవరం ప్రాంతంలో సమ్మక్క భర్త పగిడిద్ద రాజు ప్రాణాలు కోల్పోయారు. అక్కడే సారలమ్మ భర్త గోవిందరాజు కూడా చనిపోయారు. అప్పటికే కన్నెపల్లి సమీపంలోకి సైన్యాలు చొచ్చుకువచ్చాయి. ఆ ప్రాంతంలో జరిగిన పోరాటంలో సారలమ్మ ప్రాణాలు వదిలారు. జంపన్న వాగు (నాటి సంపంగి వాగు) వద్ద కాకతీయ సైన్యాన్ని జంపన్న అడ్డుకోగా భీకర పోరాటంలో ఆయనకు తీవ్రగాయాలు అయ్యాయి. దీంతో శత్రువు చేతికి చిక్కకూడదని వాగులో దూకి ప్రాణత్యాగం చేశాడు. దీంతో ఆ వాగు జంపన్నవాగుగా ప్రసిద్ధి చెందింది. చివరగా సమ్మక్క యుద్ధరంగంలోకి దిగింది. భర్త, కొడుకు, కూతురు, అల్లుడు ప్రాణాలు పోయాయని తెలిసి శత్రువులను చెండాదింది. ఆమె యుద్ధపటిమకు సైన్యం కకావికలు అయ్యింది. ఒక గిరిజన స్త్రీ ఇంతటి ప్రతిఘటన ఇస్తుందని ఊహించని కాకతీయ సైనికులు, ఆమెను వెనుక నుండి చాటుగా వచ్చి వెన్నుపోటు పొడిచారు. గాయపడిన సమ్మక్క ఈశాన్య దిశగా చిలుకలగుట్ట వైపు వెళ్లి అదృశ్యమైంది.

Next Story